Trending

6/trending/recent

Blind Village : ఆ గ్రామంలో మనుషులు, జంతువులు అందరూ గుడ్డివారే..! కారణం ఇదే

 Blind Village : ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం చాలా మర్మమైనది. కొన్ని ప్రదేశాలకు సంబంధించిన విషయాలు చాలాసార్లు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఆ కోవకు చెందినదే ఈ గ్రామం. ఎందుకంటే ఇక్కడ అంతా వింతగా ఉంటుంది. ఈ గ్రామంలో నివసించే మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా అంధులే. అందుకే ఈ గ్రామం అంధుల గ్రామంగా ప్రపంచానికి తెలుసు. అవును ఇది వినడానికి చాలా వింతగా ఉన్నా.. ఇది ఖచ్చితంగా నిజం. అంధత్వం కారణంగా ఈ గ్రామంలో నివసించే పక్షి ఏదీ ఎగరదు. అందరిది ఒకటే పరిస్థితి.

జోపోటెక్ కమ్యూనిటీ ప్రజలు సాధారణంగా ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ఇక్కడ మొత్తం 70 కుచా ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఏ ఇంట్లోనూ కిటికీ లేదు. ఎందుకంటే ఎవరూ ఏమి చూడలేరు. అందువల్ల సూర్యుడి నుంచి వచ్చే కాంతితో వాటికి పనిలేదు. అయితే ఈ గ్రామం ఇలా కావడానికి లోతైన రహస్యం దాగి ఉందని అంటారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ గ్రామంలో పిల్లలు పుట్టినప్పుడు బాగానే ఉంటారు. కానీ కొద్ది రోజుల తరువాత వారి కంటి చూపు పోతుంది. వారు గుడ్డివారు అవుతారు.

ఈ గ్రామంలో నివసించే ప్రజలు తమ అంధత్వానికి కారణం శపించబడిన చెట్టు అని నమ్ముతారు. లావుజులా అనే చెట్టును చూసిన తరువాత, ప్రతి ఒక్కరూ మానవుల నుంచి జంతువులు, పక్షులు, అంధులవుతారని వారి నమ్మకం. గ్రామస్తుల విషయంతో శాస్త్రవేత్తలు ఏకీభవించరని అందరికి తెలుసు. ప్రజల అంధత్వం వెనుక చెట్టు లేదు కానీ ప్రమాదకరమైన విషపూరిత ఫ్లై ఉందని తేల్చారు. ఈ సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత కళ్ళ ప్రధాన సిరలను మూసివేసి, మానవులను, జంతువులను, పక్షులను గుడ్డిగా మారుస్తాయని వివరించారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad