Trending

6/trending/recent

Android Apps: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. వెంటనే ఈ 8 యాప్స్ డిలిట్ చేయండి..

 Android Apps | మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? కొత్తగా కనిపించే ప్రతీ యాప్‌ను ట్రై చేస్తున్నారా? అయితే అలర్ట్. వెంటనే ఈ 8 యాప్స్ డిలిట్ చేయండి.

1. స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరూ తమ అవసరాల కోసం యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటారు. గూగుల్ ప్లేస్టోర్‌లో ఉండే యాప్స్‌లో ఉపయోగపడేవి ఎన్ని ఉంటాయో, యూజర్లకు హాని చేసేవి కూడా అన్నే ఉంటాయి. వాటినే మాల్‌వేర్, యాడ్‌వేర్ యాప్స్ అంటారు.

2. ఇలాంటి యాప్స్‌ని గుర్తించి గూగుల్ తొలగిస్తుంది. ప్రైవేట్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు కూడా మాల్‌వేర్ యాప్స్ లిస్ట్ రిలీజ్ చేస్తుంటాయి. వాటిని కూడా గూగుల్ తొలగిస్తూ ఉంటుంది.

3. తాజాగా మెకాఫీ మొబైల్ రీసెర్చ్ సంస్థ మాల్‌వేర్ ఉన్న 8 ఆండ్రాయిడ్ యాప్స్‌ని గుర్తించి లిస్ట్ రిలీజ్ చేసింది. ఆగ్నేయాసియా, అరేబియన్ పెనిన్‌సులా ప్రాంతాలకు చెందిన యూజర్స్‌ని ఎక్కువగా ఈ యాప్స్ టార్గెట్ చేసినట్టు గుర్తించింది.

4. ఫోటో ఎడిటర్స్, వాల్‌పేపర్స్, పజిల్స్, కీబోర్డ్ స్కిన్స్, కెమెరా యాప్స్ పేరుతో ఇవి యూజర్లను టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ 8 యాప్స్‌ని 7,00,000 పైగా డౌన్‌లోడ్స్ చేశారని అంచనా.

5. మొదట క్లీన్ వర్షన్‌ని గూగుల్ ప్లే స్టోర్‌కు సబ్మిట్ చేసి, అప్రూవల్ పొందిన తర్వాత అప్‌డేట్స్ ద్వారా మాల్‌వేర్ ప్రవేశపెట్టినట్టు మెకాఫీ మొబైల్ రీసెర్చ్ పరిశోధనలో తేలింది. మాల్‌వేర్‌ని గుర్తించిన మెకాఫీ మొబైల్ రీసెర్చ్ యూజర్లను అప్రమత్తం చేస్తోంది.

6. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆ 8 యాప్స్ ఉన్నట్టైతే వాటిని డిలిట్ చేయడం మంచిది. లేకపోతే మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాకు ముప్పు తప్పదు. మీరు డిలిట్ చేయాల్సి 8 యాప్స్ ఇవే.

  • com.studio.keypaper2021
  • com.studio.keypaper2020
  • org.my.favorites.up.keypaper
  • com.super.color.hairdryer
  • com.ce1ab3.app.photo.editor
  • com.hit.camera.pip
  • com.daynight.keyboard.wallpaper
  • com.super.star.ringtones



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad