Trending

6/trending/recent

Andhrapradesh: జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. రాష్ట్రంలో బుధ‌వారం నుంచి ఆంక్ష‌లు, పాక్షిక కర్ఫ్యూ

 ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. సెకండ్‌ వేవ్‌ రూపంలో మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజుకు సుమారు ఇరవై వేల పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలన్నీ నిండిపోయాయి. బెడ్లు దొరకక ఆస్పత్రుల్లోని ఆరుబయటే వీల్‌ చైర్‌లో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు కరోనా బాధితులు.  ఈ క్ర‌మంలో కోవిడ్‌–19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి (బుధవారం) నుంచి రాష్ట్రంలో ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయ‌నున్నారు. కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైయస్‌ జగన్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులకు అనుమ‌తిస్తారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే ప‌ర్మిష‌న్ ఉంటుంది. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు అవ్వ‌నున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చు. అయితే ఆ సమయంలో కూడా 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది. ప్రజలు కోవిడ్ -19 కట్టడికి సహకరించాలని.. కరోనా నిబంధనలు పాటించాలని సీఎం కోరారు. ఎవరైనా రూల్స్ అతిక్ర‌మిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జ‌గ‌న్ పోలీస్ శాఖ‌ను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు పగటిపూట కూడా కర్ఫ్యూ అమల్లోకి రానుంది. అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది అనమాట‌.

కొవిడ్ నివారణకు చర్యలపై అధికారులకు సీఎం కీల‌క ఆదేశాలు జారీ చేసిన‌ట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad