Trending

6/trending/recent

Anandayya Medicine: ఆనందయ్య మందు తయారీని పరిశీలించిన ఆయుష్ శాఖ.. ఏం చెప్పారంటే.

Anandayya Medicine: ఆనందయ్య మందును ఎవరెవరు తీసుకున్నారు? ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వివరాలు సేకరించనుంది ఆయుష్ శాఖ. మందు తయారీ, రోగుల పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత.. వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.

ఆనందయ్య ఆయుర్వేద మందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా? ఏపీ సర్కార్ నిర్ణయం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఐతే ఇది గంటల్లో తేలే వ్యవహారం కాదు. కొన్ని రోజులు పట్టే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తున్న ఆయుర్వేద మందుపై ఏపీ ఆయుష్ శాఖ పరిశీలన చేసింది. ఇవాళ ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు కృష్ణంపట్నానికి వెళ్లి ఆనందయ్య మందు తయారీ విధానాన్ని పరిశీలించారు. ఆయన ఏయే పదార్థాలు వాడుతున్నారు? ఎంత మోతాదులో వాడుతున్నారు. మందును ఎలా తయారు చేస్తున్నారో వీడియో తీశారు. ఓ రహస్య ప్రాంతంలో అధికారులకు ఆయన డెమో ఇచ్చారు. పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరం అందులో ఎలాంటి హానికారక పదార్థాలు లేవని నిర్ధారించారు. ఐతే అది కరోనాకు పనిచేస్తుందా? లేదా? తేల్చేందుకు మందులను ల్యాబ్‌కు పంపించారు.

''ఆయుష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ రోజు మందు తయారు చేశారు. మందు తయారీలో ఎటువంటి హానికర పదార్ధాలు లేవు.

ఆనందయ్య ఇచ్చేది ఆయుర్వేదం కాదు. ఆనందయ్య మందు నాటు మందుగానే పరిగణిస్తాం. కళ్ళలో వేసే మందులో కూడా సాధారణ పదార్ధాలే వాడుతున్నారు. మందు హానికరం కాదని మేం నిర్ణయానికి వచ్చాము. మందు రోగులపై పని చేస్తుందా లేదా అనేది విజయవాడ-తిరుపతి ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుంది. కేంద్ర ప్రభుత్వం సంస్థ CCRAS (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్)‌కు ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుంది. అన్ని నివేదికలు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రోగుల్లో ఆక్సిజన్ పెరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది. పసరు వైద్యం పొందిన కొందరి ఆరోగ్యం పైనా డాక్టర్ల బృందం పరిశీలన ఉంటుంది.'' అని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు.

ఆనందయ్య మందును ఎవరెవరు తీసుకున్నారు? ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వివరాలు సేకరించనుంది ఆయుష్ శాఖ. మందు తయారీ, రోగుల పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత.. వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. అటు ఐసీఆఎంర్ బృందం కూడా మే 24న కృష్టపట్నం రానున్నారు. అక్కడ ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనం చేస్తారు.

కృష్ణపట్నంలో శ్రీరామనవమి నుంచి ఆనందయ్య ఈ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది ప్రజలు తీసుకున్నారు. కరోనా రాని వారికి ఒక ముందు, ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారికి మూడు రకాల మందును అందిస్తున్నారు. దాన్ని స్వీకరించిన వారిలో ఒకరిద్దరు మినహా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. పైగా కరోనా రోగులకు రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చిందని చెబుతున్నారు. అందుకే కృష్ణపట్నం ఆయుర్వేద మందు కోసం జనం ఎగపడుతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా ఆయన మద్దతు తెలుపుతున్నారు. ఐతే మందుపై అధ్యయనం పూర్తయ్యే వరకు పంపిణీని నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మందును పంపిణీ చేయవద్దంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో కృష్ణపట్నం నిర్మానుష్యమైంది.

ఐతే ఇటీవల ఆనందయ్య వద్ద మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య‌ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని తెలిసింది. కంటిలో మందు వేయడం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చిందని.. మళ్లీ ఆస్పత్రిలో చేరారని కథనాలు వచ్చాయి. ఐతే ఆయనకు పరిస్థితి నిలకడగానే ఉందని, నీరసనంగా ఉండడంతోనే మళ్లీ ఆస్పత్రికి వెళ్లినట్లు ఆయన కూతురు వెల్లడించారు. చికిత్స అనంతరం మళ్లీ ఇంటికి వెళ్లారు. ఇప్పడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ రిపోర్టుల తర్వాతే మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Post a Comment

1 Comments
  1. మీరు త్వరగా ఈ మందు పంపిణీ పై నిర్ణయం తీసుకుని
    ఆచరణలోకి వచ్చేలా చేయండి.లేదంటే కరోనా భారిన పడి చాలా ప్రాణాలు గాలిలొ కలిసేలా ఉన్నాయి.

    ReplyDelete

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad