Trending

6/trending/recent

Vehicle Registration: వాహనాల రిజిస్ట్రేషన్​​కు కొత్త రూల్స్.. 'IN' సిరీస్‌తో నెంబర్ ప్లేట్స్..

Vehicle Registration:  రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీని సులభతరం చేయడానికి దేశమంతటా ‘యూనిఫామ్​ రోడ్ టాక్స్’ విధానం ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తోంది. కానీ అది విజయవంతం కాలేదు. అయితే కొత్త విధానం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

వాహనాలకు దేశవ్యాప్తంగా ఒకే పర్మిట్​ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానంతో రాష్ట్రాలు మారినప్పుడల్లా రిజిస్ట్రేషన్​ ఫీజులు, రోడ్​ టాక్స్​లు చెల్లించకుండానే వ్యక్తిగత వాహనాల్లో దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. వన్​ నేషన్​–వన్​ పర్మిట్​ విధానంలో భాగంగా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేని రాకపోకలకు అవకాశం కల్పించాలని ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను సిద్దం చేస్తోంది. ఈ పైలెట్​ ప్రాజెక్టును ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులు, యాజమాన్యాలకు సంబంధించిన వ్యక్తిగత వాహనాలకు ప్రతిపాదించింది.

ఉద్యోగ రీత్యా వీరంతా తరచూ ఇతర రాష్ట్రాలకు బదిలీ అవుతుంటారు. దీంతో కొత్త రాష్ట్రంలో తమ వాహనాలను మళ్లీ రిజిస్ట్రేషన్​ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ఆయా వాహనాలకు “IN” రిజిస్ట్రేషన్​ నంబర్లను కేటాయించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ రిజిస్ట్రేషన్​​ చేసుకునే క్రమంలో వారు రెండు సంవత్సరాల మొత్తానికి ఒకేసారి రోడ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీఓకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు.

కొత్త విధానంపై ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఎవరైనా తమ వ్యక్తిగత వాహనాన్ని రిజిస్ట్రేషన్​ చేసుకోవాలనుకుంటే ఒకేసారి 15 సంవత్సరాల రోడ్​ టాక్స్​ ముందస్తుగా చెల్లించాలి. ఒకవేళ ఉద్యోగి వేరే రాష్ట్రానికి బదిలీ అయ్యి తన వాహనాన్ని తీసుకెళ్తే.. అక్కడ మిగిలిన 10 లేదా 12 సంవత్సరాల రోడ్డు టాక్స్​ చెల్లించాల్సి వస్తుంది. దీంతో తమ సొంత రాష్ట్రంలో 15 సంవత్సరాలకు రోడ్డు టాక్స్​ చెల్లించినప్పటికీ మళ్లీ ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల వాహనదారుడిపై అదనపు భారం పడుతుంది. అయితే కొత్త పాలసీ ఇలాంటి సమస్యను దూరం చేస్తుంది’ అని వివరించారు.

యూనిఫామ్​ రోడ్​ టాక్స్​ పాలసీ..

రోడ్డు టాక్స్​ మొత్తాన్ని ఆటోమేటిక్​గా రాష్ట్రాల మధ్య ట్రాన్స్​ఫర్​ చేసే సిస్టమ్​తోనే ఈ సమస్యకు చెక్​ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే దీని కోసం అన్ని రాష్ట్రాలు ఒకే బోర్డు మీదకు రావాల్సిన అవసరం ఉంది. కానీ రోడ్ టాక్స్ స్లాబ్ రేట్లు ఒక్కో రాష్ట్రంలో ఒకలా ఉన్నాయని, అందువల్ల అన్ని స్లాబ్​లను ఒకే తాటిపైకి తేవడం ఇబ్బందిగా మారిందని అధికారులు అంటున్నారు. దీనికి చెక్​ పెట్టేందుకు దేశమంతటా యూనిఫామ్​ రోడ్​ టాక్స్​ రేట్లను ఖరారు చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనల ప్రకారం రూ. 10 లక్షల వరకు ఖరీదు చేసే వాహనాలకు 8%, 20 లక్షలకు పైగా ఖరీదు చేసే వాహనాలకు 12% రోడ్​ టాక్స్​ను నిర్ణయించింది. ఏ రాష్ట్ర ఆదాయానికి గండిపడకుండా మద్యే మార్గంగా ఈ ధరలను నిర్ణయించినట్లు ఉన్నతాధికారి తెలిపారు.

రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీని సులభతరం చేయడానికి దేశమంతటా ‘యూనిఫామ్​ రోడ్ టాక్స్’ విధానం ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తోంది. కానీ అది విజయవంతం కాలేదు. అయితే కొత్త విధానం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని అధికారులు భావిస్తున్నారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad