Trending

6/trending/recent

Vaccine: కోవిషీల్డ్, కోవాగ్జిన్ లో ఏది బెస్ట్. సెకెండ్ డోస్ ఏది ఎన్ని రోజుల్లో తీసుకోవాలి? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి?

 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఏ వ్యాక్సిన్ మంచిది. కోవాగ్జిన్ సెకెండ్ డోస్ తీసుకోడానికి ఎంత గ్యాప్ ఉండాలి? కోవిషీల్డ్ సెకెండ్ డోస్ ఎన్ని రోజుల్లో తీసుకోవాలి..? తొలి డోస్ కొవాగ్జిన్ తీసుకుని సెకెండ్ డోస్ కొవిషీల్డ్ తీసుకుంటే ఏం జరుగుతుంది?

తెలుగు రాష్ట్రాల్లో కరనో పంజా విసురుతోంది. ఏపీలో ఒక్కరోజులోనే దాదాపు 14 వేలకుపైగా కేసులు నమోదు అవుతుంటే? తెలంగాణలో 7 వేల మందికిపైగా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. ముంఖ్యంగా సెకెండ్ వేవ్ లో కరోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి వేగంగా విజృంభిస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అంద‌రూ కరోనా బారిన పడుతున్నారు. కరోనా ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్నసమయయంలో మాస్కు ధరించాం.. సామాజిక దూరం పాటించాం అంటే సరిపోదు.. కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. అదొక్కటే ప్రస్తుతం కరోనాకు సరైన అస్త్రం. కానీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోక జనం సతమతమవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోడానికి ఇప్పటికే చాలామంది భయపడుతున్నారు అంటే అనుమానాలు ఏం రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అధికారులు, సిబ్బంది అవగాహన లోపం జనం భయానికి కారణమవుతోంది. అసలు చాలామంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయితే వారు వేసుకున్న తొలి డోస్ కోవాగ్జినా లేకా కోవీషీల్డా అన్నది కూడా తెలియడం లేదు. అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్ వెళ్తే అక్కడ డోస్ వేసి.. చేతిలో పారాసిట్మల్ ట్యాబెల్ ఇచ్చి.. 28 రోజులు లేదా 42 రోజుల తరువాత రండి అని చెబుతున్నారు. దీంతో కన్ఫ్యూజన్ మొదలవుతోంది. ఇంతకీ 28 రోజుల్లో రావాలా? 48 రోజుల్లో రావాలా? అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. అంతేకాదు చాలామందిని మీరు తొలి డోస్ ఏది తీసుకున్నారు అంటే వ్యాక్సిన్ అని చెబుతున్నారు తప్పా.. అది కోవాగ్జినా, కోవిషీల్డా అన్నది కూడా తెలియడం లేదు. మరి తొలి డోస్ కోవాగ్జిన్ తీసుకుని రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకుంటే ఏం అవుతుంది? లేదా తొలి డోస్ కోవీషీల్డ్ తీసుకుని రెండో డోస్ కోవాగ్జిన్ తీసుకుంటే ఏంటి పరిస్థితి ఇలాంటి అనుమానాలు చాలామందని వెంటాడుతున్నాయి? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ డోస్ లే ఎక్కువగా ఉన్నాయి. అయితే కొంతమంది జనాల్లో కోవిషీల్డ్ కంటే కోవాగ్జిన్ మంచిదని నమ్ముతూ వ్యాక్సినేషన్ కు దూరంగా ఉంటున్నారు. మరి రెండింటిలో ఏ వ్యాక్సిన్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వైద్య నిపుణులు ఇచ్చే సలహా ఏంటి?

కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లో ఏది మంచిది?

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం రెండు వ్యాక్సిన్ల‌ను అందుబాటులో ఉన్నాయి. అయితే కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ ఎక్కువగా పంపిణీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కోవాగ్జిన్ అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లలో ఈ రెండింటిలో మ‌న‌కు న‌చ్చిన వ్యాక్సిన్‌ను ఎంచుకునేందుకు అవ‌కాశం లేదు. ఆయా జిల్లాల టీకా కేంద్రాల్లో ఏది అందుబాటులో ఉంటే అది వేయించుకోవడం ఒక్కటే మార్గం. ఈ రెండింటిలో ఒక‌టి మంచిది, ఇంకోటి మంచిది కాదు అని చెప్పడం కరెక్టు కాదని.. రెండు మంచి ఫలితాలే ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండూ కూడా క‌రోనా వైర‌స్‌పై స‌మ‌ర్థంగా ప‌నిచేస్తాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అందువ‌ల్ల రెండింటిలో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవ‌చ్చు.

మొద‌టి డోస్ ఒక టీకా తీసుకుని.. రెండో డోస్ లో మరో టీకా తీసుకోచ్చా? 

తొలి డోస్ కోవాగ్జిన్ తీసుకుంటే సెకెండ్ డోస్ కూడా అదే వేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ తీసుకుంటే రెండో డోస్ కచ్చితంగా కోవిషీల్డ్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే కోవాగ్జిన్ ఇన్‌యాక్టివేటెడ్ ప్లాట్‌ఫాంపై త‌యారైంది. కోవిషీల్డ్ వైర‌ల్ వెక్ట‌ర్ ప్లాట్‌ఫాంపై ఆధార‌ప‌డి ఉంటుంది. దీంతో రెండు టీకాల‌ను క‌లిపి తీసుకోవ‌డం అస్సలు ఏ మాత్రం మంచిది కాదు. క‌రోనావైర‌స్‌ను ఎదుర్కొనేందుకు రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్‌ను మాత్ర‌మే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్ అవసరమా?

ఎవరికైనా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి.. ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. త్వరగా కోలుకున్నామళ్లీ రాదనే నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. దీనివ‌ల్ల యాంటీబాడీలు పూర్తిస్థాయిలో ఉత్ప‌త్తి అవుతాయి. దీంతో మ‌ళ్లీ వైర‌స్ సోకే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత క‌రోనా వ‌స్తే ఏం చేయాలి?

క‌రోనా నుంచి కోలుకున్న రెండు వారాల‌కు రెండో డోస్ తీసుకోవ‌చ్చు. అదే మొద‌టి డోస్ తీసుకోక‌ముందు క‌రోనా వ‌స్తే.. రిక‌వ‌రీ అయినా 28 రోజుల త‌ర్వాత‌నే వ్యాక్సిన్ వేసుకోవాలి.

మొదటి డోస్ నుంచి రెండో డోస్ కు మధ్యలో ప్రత్యేకమైన డైట్ ఫాలో అవ్వాలా?

కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న తరువాత కనీసం 28 రోజుల విరామం అవసరం. ఆ విరామంలో ఎలాంటి ప్రత్యేకమైన డైట్ ఫాలో అవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఎప్పుడూ తీసుకునే ఆహార‌మే తీసుకోవాలి. అయితే ఆల్కాహాల్ కు, చెడు వ్యసనాలకు చాలా దూరంగా ఉండడమే మంచిది అన ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండ‌టం మంచిది.


కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండువ్యాక్సిన్ల రోడో డోస్ కు మధ్య 28 రోజుల గ్యాప్ ఉండాలా?

సాధరణంగా మొదటి డోస్ తీసుకున్న తరువాత 28 రోజుల గ్యాప్ ఉండాలని స్థానికంగా వ్యాక్సిన్ వేసిన సమయంలో సిబ్బంది చెబుతున్నారు. అయితే సరిగ్గా 28 రోజులు పూర్తైన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దానివ‌ల్ల ఎలాంటి ఇబ్బందే ఉండదు. కాక‌పోతే 6 నుంచి 8 వారాల్లోపు క‌చ్చితంగా రెండో డోస్ తీసుకోవాలి. అప్పుడే ఫ‌లితం ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో కోవాగ్జిన్ కు 28 రోజుల నుంచి 42 రోజుల విరామం తీసుకోవాలని.. అదే కోవిషీల్డ్ రెండో డోస్ కోసం 28 నుంచి 56 రోజుల విరామం తీసుకోవచ్చని పేర్కొంది. కోవిషీల్డ్ కంపెనీ ప్రతినిధుల వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. కోవిషీల్డ్ తొలి డోస్ నుంచి రెండో డోస్ కు రెండు నుంచి మూడు నెలల గ్యాప్ ఉంటే కచ్చితంగా 90 శాతం ప్రభావం చూపిస్తుందని కోవిషీల్డ్ ప్రతినిధులు చెబుతున్నారు.

గ‌ర్భిణులు, బాలింత‌లు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?

ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఉన్న రెండు వ్యాక్సిన్ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను గ‌ర్భిణులు, పిల్ల‌ల‌పై చేయ‌లేదు. కాబ‌ట్టి గ‌ర్భిణులు, బాలింత‌లు, పిల్ల‌లు వ్యాక్సిన్లు తీసుకోవాలని చెప్పాలేం.. వారు వ్యాక్సిన్ తీసుకోవ‌డంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎలాంటి సిఫార‌సులు చేయ‌లేదు.

దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు మెడిసిన్ ఆపేయాలా?

అవసరం లేదు. క‌రోనా వ్యాక్సిన్‌పై ఇత‌ర మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూపించ‌వు. బీపీ, షుగ‌ర్ వంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు మందులు వాడే వారు నిర‌భ్యంతరంగా వ్యాక్సిన్ వేసుకున్నా వాటిని వేసుకోవ‌చ్చు.

థైరాయిడ్ పేషెంట్లు టీకా తీసుకోవ‌చ్చా? వ్యాక్సినేష‌న్ ముందు క‌రోనా టెస్ట్ చేయించుకోవాలా?

థైరాయిడ్ పేషెంట్లు తప్పకుండా టీకా తీసుకోవ‌చ్చు. దానివ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. క‌రోనా వ్యాక్సిన్ వేసే ముందు భార‌త్‌లోనే కాదు ప్ర‌పంచంలో ఎక్క‌డా కొవిడ్‌-19 టెస్ట్ చేయ‌డం లేదు. అయితే క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు అనిపిస్తే మాత్రం టెస్ట్ చేయించుకోవాలి.

వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయా?

ఏ టీకా తీసుకున్నా కొన్ని దుష్ప్ర‌భ‌వాలు ఉంటాయి. కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత కొంత‌మందికి ఒళ్లు నొప్పులు, తేలిక‌పాటి జ్వ‌రం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, కీళ్లనొప్పులు వంటివి రావ‌చ్చు. కానీ ఇవ‌న్నీ రెండు నుంచి మూడు రోజుల్లో త‌గ్గిపోతాయి. కాబ‌ట్టి వీటి విష‌యంలో ప్రజలు అంత భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad