Trending

6/trending/recent

Toothbrush: మీరు వాడే టూత్ బ్రష్ కు ఆయుస్సు ఉంటుంది.. ఎన్ని నెలలకు మార్చాలంటే..

Toothbrush: ఆధునిక జీవితంలో ఎన్నో మార్పులు.. పాతవాటి స్తానంలో కొత్త కొత్త అలవాట్లు.. అలాంటిది ఒకటి దంతావధానం. పూర్వకాలంలో పళ్ళను శుభ్రపరచుకోవడానికి వేప పుల్లని ఎక్కువగా ఉపయోగించేవారు. కాలక్రమంలో చోటు చేసుకున్న మార్పులతో వేప పుల్ల బదులు.. టూత్ బ్రష్ లు వచ్చి చేరాయి. దీంతో రోజు పొద్దున్న పళ్ళను శుభ్రపరచుకోవడానికి ఎక్కువుగా టూత్ బ్రష్ ఉపయోగిస్తున్నాం. అయితే కొంత మంది ఈ బ్రష్ ను బాగా వాదిస్తారు.. ఎంతగా అంటే.. బ్రష్ కుచ్చు అరిగిపోయి.. ఇక విరిపోతుంది అనుకున్న తర్వాత అప్పుడు టూత్ బ్రష్ ను మారుస్తారు. అయితే నిజానికి టూత్ బ్రష్ కు కూడా ఆయుస్సు ఉంటుంది. దానికి అంతకు మించి వాడితే.. ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని దంతవైద్యులు సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

టూత్ ను సాధారణంగా 3 నెలలకు మించి వాడకపోవడమే మంచిది. తయారీదారులు, దంతవైద్యుల సిఫారసుల ప్రకారం, మీ టూత్ బ్రష్ ప్రతి 12 నుండి 16 వారాలకు ఒకసారి మార్చాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తారు. అలా మార్చకపోతే అది మీ దంత ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

చిగుళ్ళ వ్యాధి, దంత క్షయం, దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడి మీ దంతాలకు రక్షణ కల్పిస్తుంది మీ టూత్ బ్రష్. మృదువైన బ్రిస్టల్ బ్రష్ మీ దంతాల చుట్టూ ఉన్న ఆహారం మరియు బ్యాక్టీరియాను సమర్థవంతంగా తొలగిస్తుంది. రోజుకు రెండుసార్లు 2 నిమిషాల పాటు పళ్ళు తోముకోవడాన్ని దంత వైద్యులు సిఫారసు చేస్తారు. అలా చేయడం ద్వారా టూత్ క్యావిటీస్ నుంచి రక్షణ కలుగుతుంది. భోజనం చేసిన ప్రతి సారి పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారం తొలగించడానికి బ్రష్ చేసుకోవడం ఎంతైనా అవసరం. మధ్యాహ్న భోజనానంతరం వీలు కాకపోతే రాత్రి పూట కచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. స్వీట్స్ వంటి చక్కెర పదార్థాలు తిన్న తరువాత తప్పనిసరిగా నోరు పుక్కిలించాలి.

ఇక రోజూ మీరు పళ్ళను శుభ్రపరచుకునే టూత్ బ్రష్‌ను 3 నుండి 4 నెలలకు ఒకసారి మార్చాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (సిడిసి) సలహా ఇస్తుంది. అంతేకాదు మీ టూత్ బ్రష్ ను మరెవరైనా పొరపాటున ఉపయోగిస్తే, దాన్ని శుభ్రంచేసి మళ్లీ వాడొద్దని అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి నోరు భిన్నమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. అందుకని ఒకరు వాడిన టూత్ బ్రష్ ను వేరొకరు వాడడంతో అనారోగ్యానికి కారకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇక ఫ్యామిలీ మొత్తం టూట్ బ్రష్ లను ఒకే ప్లేస్ లో ఉంచుతారు. అయితే అలా వాటిని ఉంచినప్పుడు ఒకదానికి హెడ్స్ ఒకటి తగలకుండా చూసుకోవాలి. బ్రష్ చేసిన తర్వాత, మీ టూత్ బ్రష్‌ను శుభ్రంగా నీటిలో కడగాలి. ముఖ్యంగా వారానికి ఒకసారి వేడి నీరు ఉప్పు వేసిన నీటితో టూత్ బ్రష్ ను శుభ్రపరచాలి దంత వైద్యులు సూచిస్తున్నారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad