Trending

6/trending/recent

SSY Scheme: రోజుకు రూ. 416 పెట్టుబడి.. చేతికి రూ. 64 లక్షలు. పూర్తి వివరాలివే..!

Sukanya Samriddhi Yojana: ప్రస్తుత కాలంలో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపధ్యంలో రాబోయే కాలానికి ప్రతీ ఒక్కరూ కూడా డబ్బులు ముందుగానే పొదుపు చేసుకోవడం చాలా అవసరం. మధ్యతరగతి తల్లిదండ్రులు తమ కుమార్తెల విద్య, వివాహ ఖర్చుల నిమిత్తం ఎలప్పుడూ ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు పెట్టుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.

సరైన వ్యూహం, పెట్టుబడి పెట్టడం ద్వారా, రాబోయే సమయంలో అవసరాలకు ఎక్కువ మొత్తంలో డబ్బును పొందుపరుచుకోవచ్చు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పొదుపు, పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోవాలని బిజినెస్ విశ్లేషకుల అభిప్రాయం. ఇందులో భాగంగానే మీ కుమార్తెలకు ఉజ్వల భవిష్యత్తు ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) పధకం. ఈ పధకం కేవలం అమ్మాయిలకు మాత్రమే.

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు:

ప్రతి త్రైమాసికం ప్రారంభంలో ఈ పథకానికి వడ్డీ రేటును ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఈ పథకంపై ప్రస్తుత వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది.
సుకన్య సమృద్ధి స్కీమ్‌లో చేరడం వల్ల అమ్మాయిలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. వివాహం, ఉన్నత చదువులు వంటి వాటి కోసం స్కీమ్‌ డబ్బులను ఉపయోగించుకోవచ్చు. అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు.

మీ కుమార్తె 21 సంవత్సరాలలో లక్షాధికారి కావచ్చు…

ఈ పథకంలో ఓ వ్యక్తి తన కుమార్తెకు ఒక సంవత్సరం వయసున్నప్పుడు ఎస్‌ఎస్‌వై ఖాతా తెరిస్తే, అందులో ప్రతీ నెలా రూ.12,500 పెట్టుబడి పెట్టడం ద్వారా, ఖాతా మెచ్యూరిటీ సమయం ముగిసేసరికి మొత్తం రూ .63.7 లక్షలు పొందవచ్చు. అందులో మీరు జమ చేసిన సొమ్ము రూ. 22.5 లక్షలు కాగా, రూ. 41.29 లక్షల వడ్డీ రూపంలో వస్తుంది.

ప్రతి సంవత్సరం ఎంత పెట్టుబడి పెట్టవచ్చు..

ఈ పథకం కింద మీరు ఎంత పెట్టుబడి పెట్టవచ్చో ఆలోచిస్తూ ఉండొచ్చు. ప్రతీ సంవత్సరం రూ .1,000 నుండి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్లు రూ .1.5 లక్షలకు మించకపోతే, సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా ఈ ఫండ్‌లో డబ్బులు జమ చేయవచ్చు.

ఈ పథకానికి సంబంధించిన కీలక విషయాలు:

  • కుమార్తె 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినప్పుడు లేదా 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మీరు ఈ పధకం నుంచి పాక్షిక ఉపసంహరణలు చేయవచ్చు. ఈ పధకంలో మొత్తం 15 సంవత్సరాల వరకు పెట్టుబడులు అవసరం. అదే సమయంలో, దీని మెచ్యూరిటీ సమయం 21 సంవత్సరాలు.
  • ప్రతి సంవత్సరం ఎస్‌ఎస్‌వైలో రూ .1.5 లక్షల వరకు పెట్టుబడులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ఏ తల్లిదండ్రులు అయినా సెక్షన్ 80సి కింద మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. 
  • ఈ పథకం కింద వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తంపై కూడా ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad