Trending

6/trending/recent

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

SBI Recruitment 2021 | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వేర్వేరు విభాగాల్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్, అడ్వైజర్, డేటా అనలిస్ట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2021 ఏప్రిల్ 13న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మే 3 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

SBI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 86

  • మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్)- 1
  • మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్)- 2
  • సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (కాంప్లయెన్స్)- 1
  • సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (స్ట్రాటజీ-టీఎంజీ)- 1
  • సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (గ్లోబల్ ట్రేడ్)- 1
  • సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (రీటైల్ అండ్ సబ్సిడరీస్)- 1
  • సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఫైనాన్స్)- 1
  • సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (మార్కెటింగ్)- 1
  • డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (ఐటీ-డిజిటల్ బ్యాంకింగ్)- 1
  • మేనేజర్ (హిస్టరీ)- 1
  • ఎగ్జిక్యూటీవ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్-ఆర్కైవ్స్)- 1
  • మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్)- 20
  • మేనేజర్ (జాబ్ ఫ్యామిలీ అండ్ సక్సెషన్ ప్లానింగ్)- 1
  • మేనేజర్ (రెమిటెన్సెస్)- 1
  • డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్-ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్)- 1
  • డిప్యూటీ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్)- 5
  • డిప్యూటీ మేనేజర్ (ఎనీటైమ్ ఛానెల్)- 2
  • డిప్యూటీ మేనేజర్ (స్ట్రాటజిక్ ట్రైనింగ్)- 1
  • చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్- 1
  • అడ్వైజర్ (ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్)- 3
  • ఫార్మాసిస్ట్- 34
  • డేటా అనలిస్ట్- 5

SBI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 13
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 3
  • ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2021 ఏప్రిల్ 13 నుంచి 2021 మే 3
  • దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2021 మే 3
  • దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2021 మే 15
  • విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
  • దరఖాస్తు ఫీజు- రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
  • ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ

SBI Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా

  • అభ్యర్థులు ముందుగా https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • అందులో మీరు అప్లై చేయాలనుకుంటున్న నోటిఫికేషన్‌లో Apply Online పైన క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • కొత్త పేజీలో Click for New Registration పైన క్లిక్ చేయాలి.
  • పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి.
  • ఆ తర్వాత స్టెప్‌లో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
  • మూడో స్టెప్‌లో క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
  • నాలుగో స్టెప్‌లో ఓసారి దరఖాస్తులో సబ్మిట్ చేసిన వివరాలన్నీ సరిచూసుకోవాలి.
  • చివరి స్టెప్‌లో పేమెంట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
  • దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad