Trending

6/trending/recent

Railway Recruitment 2021: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోడానికి ఏప్రిల్‌ 30 చివరి తేదీ

 Railway Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇక రైల్వేలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై నోటిఫికేషన్స్‌ జారీ అవుతున్నాయి. రాజస్థాన్‌లోని కోటా కేంద్రంగా పని చేస్తున్న వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే నుంచి పలు అప్రంటీస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పలు అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 716 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు ఈనెల 30 చివరి తేదీ. అర్హులైన అభ్యర్థులకు రేపటి వరకే అవకాశం ఉంది. మొత్తం 716 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందులో ఎలక్ట్రీషియన్‌ విభాగంలో 135, ఫిట్టర్‌ విభాగంలో 102, వెల్డర్‌ 43, పెయింటర్‌ 75, మేసన్‌ 61, కార్పెంటర్‌ విభాగంలో 73 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్లంబర్‌ విభాగంలో 58, బ్లాక్‌స్మిత్‌ 63, ఫైర్‌ మ్యాన్‌ 50, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ విభాగంలో 10 ఖాళీలు, మెషినిస్ట్‌ విభాగంలో 5, టర్నర్‌ 2, ల్యాబ్‌ అసిస్టెంట్‌ 2, క్రేన్‌ అసిస్టెంట్‌ 2, డ్రాఫ్ట్స్‌ మెన్‌ విభాగంలో 5 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో తెలిపింది.

అయితే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఐటీఐ, పదో తరగతిలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఫీజు రూ.170ని చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు పీజులో మినహాయింపు ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులు కోటా డివిజన్‌లో పని చేయాలని నోఫికేషన్‌లో స్పష్టం చేశారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad