Trending

6/trending/recent

Mera Ration: రేషన్ కార్డు దారులకు గుడ్‌ న్యూస్‌.. మీ కార్డ్‌పై వచ్చే ఆహార పదార్థాల సమాచారం ఇలా తెలుసుకోండి..

Mera Ration App : మీకు రేషన్ కార్డు ఉంటే.. మీ కోటాకు సంబంధించిన సమాచారం కోసం పీడీఎస్‌ కేంద్రానికి వెళ్లనవసరం లేదు. రేషన్ షాపుకి వెళ్లి అక్కడ క్యూ లైన్‌లో నిలుచునే అవసరం లేదు. మీకు కావలసిని సమాచారం ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మీకు స్మార్ట్ ఫోన్ కావాలి.. లేదంటే మీ కుటుంబ సభ్యుడి ఫోన్‌ తో కూడా ఈ పని చేయవచ్చు. కరోనా మహమ్మారిని నివారించడానికి విధించిన లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. లాక్డౌన్ సమయంలో ప్రజలు రేషన్ పొందడంలో ఎటువంటి సమస్యను ఎదుర్కోకూడదు..

ఆహారం కోసం ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఒక యాప్‌ను ప్రారంభించింది. మీరు Google Play స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిని ప్రారంభించడానికి ప్రత్యేక కారణం ఏంటంటే వలస కార్మికులు. వీరు ఏ నగరంలోనైనా రేషన్ తీసుకోవడానికి ఈ సౌకర్యం కల్పించారు. అయితే ఈ యాప్ పేరు మేరా రేషన్. దీని ద్వారా మీరు ప్రభుత్వ రేషన్ దుకాణానికి వెళ్లకుండా మొత్తం సమాచారాన్ని ఇంట్లో నుంచే పొందవచ్చు.. మీరు మొదట గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి. ప్లే స్టోర్‌లో మేరా రేషన్ అనువర్తనాన్ని శోధించి డౌన్‌లోడ్ చేయండి.తర్వాత దాన్ని ఇన్‌స్టాల్ చేసి మీ సమాచారాన్ని నమోదు చేసుకోండి. ఇక రిజిస్ట్రేషన్ తరువాత, మీరు ఇక్కడ అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు. దీని ద్వారా చాలా ఉపయోగాలున్నాయి వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం..

ఇక్కడ క్లిక్ చేసి మేరా రేషన్ యాప్ ను ఇంస్టాల్ చేసుకొండి 

1. ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డు ద్వారా సులభంగా లాగిన్ అయ్యే సౌకర్యం
2. మేరా రేషన్ యాప్‌తో మీ రేషన్ షాప్ ఖచ్చితమైన సమాచారాన్ని పొందుతారు
3. రేషన్ కార్డ్ హోల్డర్లు కూడా ఇక్కడ సూచనలు ఇవ్వవచ్చు
4. రేషన్ వస్తున్నప్పుడు ఎంత కోటా ధాన్యం లభిస్తుందనే సమాచారం తెలుసుకోవచ్చు.
5. ప్రస్తుతం ఈ యాప్‌ హిందీ, ఆంగ్ల భాషకు మద్దతు ఇస్తుంది. రాబోయే కాలంలో, 14 భారతీయ భాషలలో ఇది సులభతరం అవుతుంది
6. ఉపాధి కోసం ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్ళే కార్మికులు ఈ యాప్‌ నుంచి రేషన్ పొందడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది
7. రేషన్ పంపిణీ విధానంలో పారదర్శకత వస్తుంది
8. వలస కార్మికులు తమ స్థానానికి ఏ రేషన్ షాపు దగ్గరగా ఉందో తెలుసుకోగలుగుతారు

జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం.. 81 కోట్లకు పైగా ప్రజలకు కిలోకు 1-3 రూపాయల సబ్సిడీతో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందిస్తుంది. దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంతో అనుసంధానించబడ్డాయి. ఈ పథకం త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయబడుతుంది.

One Nation One Ration Card plan ensures distribution of subsidised foodgrains to ration card holders under NFSA to lift the entitled foodgrains from any Fair Price Shop (FPS) anywhere in the country by using their same/existing NFSA ration card after biometric/Aadhaar authentication on an electronic Point of Sale (ePoS) device. Under this scheme, beneficiaries will continue to get Rice, Wheat and Coarse Grain at the rate of Rs. 3, Rs. 2 and Rs. 1 per Kg respectively in other States as well.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad