Trending

6/trending/recent

Fact Check: నెలసరి సమయంలో మహిళలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చా ?

Fact Check - Vaccine in Periods Time:  ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.  లక్షల సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.  రోజుకు 3 లక్షలు దాటుతున్నాయి కేసులు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. ఇందులో బాగంగానే  కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ అందించనున్నారు.  ఇప్పటికే దేశంలో 45 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తున్నారు.  అయితే, 18 ఏళ్ళు నిండిన వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ అందించబోతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్ ను ఫ్రీగా ప్రజలకు అందించేందుకు ముందుకు రావడం విశేషం. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా లో నిన్నటి నుంచి ఓ వార్త వైరల్  అవుతోంది. పీరియడ్స్ కు 5 రోజుల ముందు,  పీరియడ్స్ కు 5 రోజుల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవద్దని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ సమయంలో మహిళల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. వ్యాక్సిన్ వేసుకున్న తొలి రోజుల్లో ఇమ్యూనిటీ తగ్గుతుందని, ఆ తర్వాత క్రమంగా పెరుగుతుందని అందులో ఉంది.  అందుకే పీరియడ్స్  సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని దాని సారాంశం. ఈ న్యూస్ నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ న్యూస్ ను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది.  ఇది తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ ఎలాంటి భయం లేకుండా  వ్యాక్సిన్ వేసుకోవచ్చని చెప్పింది.  

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad