Trending

6/trending/recent

Covid Care: కరోనాపై ఎలాంటి సందేహాలకైనా ఈ నెంబర్ కు కాల్ చేయండి.. చిటికెలో సమాధానం

కరోనా (Corona Virus) భయంతో వణికిపోతున్న ప్రజలకు అండగా ఉంటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

ఇప్పటికే కొవిడ్ ట్రీట్ మెంట్ ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చిన ప్రభుత్వం.. దాదాపు 200 ఆస్పత్రుల్లో కొవిడ్ ట్రీట్ మెంట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది.

అలాగే హోం ఐసోలేషన్లో ఉన్నవారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వైద్య సిబ్బందిని నియమించింది.

ఐతే కొవిడ్ పై సరైన సమాచారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసింది.

కొవిడ్ ట్రీట్ మెంట్ కోసం 104 కాల్ సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం. దీని ద్వారానే అవసరమైన సమాచారాన్ని అందిస్తోంది.

104కు కాల్ చేస్తే కొవిడ్ ఆస్పత్రుల సమాచారం, ఖాళీగా ఉన్న బెడ్స్ సమాచారంతో పాటు కొవిడ్ నిర్ధారణై ఆస్పత్రిలో చేరే పరిస్థితిలో ఉంటే 3గంటల్లో బెడ్ కేటాయించేలా చర్యలు తీసుకుంటుంది.

104 కాల్ సెంటర్ ను మరింత బలోపేతం చేస్తున్న ప్రభుత్వం.. టెలిమెడిసన్ సేవలను కూడా దీనికి అనుసంధానం చేయనుంది. ఇందుకోసం 300 మంది డాక్టర్లను తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్న ప్రభుత్వం కరోనా రోగులకు అవసరమైన సూచనలు, సలహాలను ఈ కాల్ సెంటర్ ద్వారానే అందిస్తోంది.

104 కాల్ సెంటర్ ద్వారా అధిక ఫీజులు వసూలు చేయడం, సరైన ట్రీట్ మెంట్ ఇవ్వకపోవడం వంటి వాటిపై ఫిర్యాదులు కూడా చేయవచ్చు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad