Trending

6/trending/recent

Cold Water Bathing: ఎండాకాలంలో చల్లని నీటితో స్నానం చేయకూడదా..

భారతదేశంలో వేసవికాలం అంటే ఎండలు మండిపోయే కాలం. ఉత్తర భారతదేశంలో ఎండాకాలం బాగా పొడిగా ఉంటే దక్షిణ భారతదేశంలో హ్యుమిడిటీ ఎక్కువ, దాంతో ప్రజలు ఎంతో అసౌకర్యానికి గురవుతారు.

  • పెరిగే ఎండలతో ప్రజలు సతమతం
  • చిట్కాలతో ఎండ వేడికి దూరం 
దేశం ఇప్పటికే మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఈ మహమ్మారి ప్రళయ తాండవాన్ని ఆపడం కోసం దేశం మొత్తం ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే హీట్ వేవ్స్ వల్ల ఇంకొక సమస్య కూడా ఎదురైనట్లే. వేడి బాగా ఎక్కువగా ఉంటే ఎండ దెబ్బకే కాక కార్డియో వాస్క్యులర్ డిస్ట్రెస్, బ్రెయిన్ స్ట్రోక్, రెస్పిరేటరీ డిసార్డర్స్ కోసం కూడా హాస్పిటల్‌లో చేరవలసి వస్తుంది.

ఎండ బాగా ఎక్కువగా ఉంటే హీట్ స్ట్రోక్ రావచ్చు, ఇది చాలా సీరియస్ డిసార్డర్. హీట్ స్ట్రోక్ అంటే వాతావరణంలో వేడి వల్ల బాడీ టెంపరేచర్ 104 డిగ్రీల ఫారెన్ హీట్ దాటి ఉండడం. బాడీ తన టెంపరేచర్ ని తగ్గించుకోకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. చెమట పట్టకపోవడంతో శరీరం చల్లబడదు. హీట్ వేవ్స్ వల్ల కంఫ్యూజన్, తలనొప్పి, వికారం, డిజ్జీనెస్ వంటివి ఉంటాయి. ఈ సమస్యకి తక్షణం వైద్య సహాయం అందకపోతే అది మరణానికి కానీ, శాశ్వత వైకల్యానికి కానీ దారి తీయవచ్చు.

ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి, వాటిని పాటించండి, ఈ సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండండి.

1. హైడ్రేషన్ ముఖ్యం..

మీరు బయటకి వెళ్ళినప్పుడల్లా మీతో పాటు ఒక బాటిల్ నిండుగా నీరు కూడా తీసుకుని వెళ్ళండి. ఈ వేడిని తట్టుకోవడానికి మీరు ఎక్కువగా నీరు తాగడం, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం వంటివి చేయాలి. కొబ్బరి నీరు, చెరుకు రసం కూడా ఎంతో మంచివి. మీరు బయటకి వెళ్ళినప్పుడు గ్లూకోజ్ నీరు తీసుకుని వెళ్ళడం కూడా మంచి ఆప్షనే, అది మీకు తక్షణ శక్తినిస్తుంది. మీకు ఏదైనా మెడికల్ కండిషన్ ఉండి మీ డాక్టర్ మీ ఫ్లూయిడ్ ఇన్‌టేక్‌ని లిమిట్ చేస్తే వారితో ఒకసారి మాట్లాడి వేసవికాలంలో ఎంత నీరు తాగవచ్చో చెక్ చేసుకోండి. ఆల్కహాల్‌కి దూరంగా ఉండండి, కాఫీ, టీ లాంటి వేడి పానీయాలు, పంచదార ఉన్న పానీయాలకి దూరంగా ఉండడం మంచిది.

2. సీజనల్ ఫ్రూట్స్..

మామిడి పండ్లు, పుచ్చకాయలు, కీరా, ఆకుకూరలు మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. పైగా మీకు అవసరమైన విటమిన్స్, మినరల్స్ కూడా ఇస్తాయి. ఇవి తేలికగా అరుగుతాయి కూడా.

3. గొడుగు మీతో పాటూ..

మీరు బయటకి వెళ్ళినప్పుడల్లా మీతో పాటూ ఒక గొడుగు తీసుకు వెళ్ళడం మర్చిపోకండి, ఈ అలవాటు మిమ్మల్ని సూర్యుని తీక్షణ కిరణాల నుండి రక్షిస్తుంది.

4. రెండు సార్లు స్నానం..

బాడీ టేంపరేచర్ ని స్నానం తగ్గిస్తుంది. మరీ చల్లని నీరు కాకుండా కొద్దిగా గోరు వెచ్చగా ఉన్న నీటితో స్నానం చేయడం మంచిది, కోల్డ్ షవర్ వల్ల బాడీ హీట్ ప్రిజర్వేషన్ మోడ్ లోకి వెళ్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

హీట్ రిలేటెడ్ డిస్ట్రెస్‌ని ఎలా మ్యానేజ్ చేయాలి?

1. మీకు సహాయం అవసరమయినప్పుడు ఎవరికి కాల్ చేయాలో తెలుసుకుని ఉండండి.
2. మీకేవైనా మెడికల్ కండిషన్స్ ఉంటే మీ డాక్టర్ సూచనలని ఫాలో అవ్వండి.
3. మీకు బాలేకపోతే మీకు దగ్గరగా ఉన్న హాస్పిటల్ లో వైద్య సహాయం పొందండి.
4. మధ్యాహ్నాలు ఇంటి నుండి బయటకి వెళ్ళకండి.
5. వదులుగా, తేలికగా ఉండే లేత రంగుల దుస్తులు ధరించండి.
6. మీరు బయట నుండి ఇంటికి వచ్చిన తరువాత చల్లని పానీయమేదైనా తాగండి. లెమొనేడ్, మజ్జిగ, కొబ్బరి నీరు లేదా చల్లని నీరు అయినా మంచిదే.

హీట్ రిలేటెడ్ డిస్ట్రెస్ తరువాత..

1. ఫ్లూయిడ్స్ బాగా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.
2. తాజా పండ్లూ, కూరగాయలు తీసుకోండి.
3. వేడి వాతావరణం చాలా అలసటకి గురి చేస్తుంది, కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి.
4. ఈ హీట్ డిస్ట్రెస్ తగ్గిన తరువాత కూడా మీకేదైనా అసౌకర్యం ఉంటే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad