Trending

6/trending/recent

Calories: మనం రోజూ ఎన్ని కేలరీలు తీసుకోవాలి... ఎవరు ఎంత తినాలి... తెలుసుకుందాం.

Calories: మన పెద్దవాళ్లు... మనల్ని చూడగానే... బక్కచిక్కిపోయావ్... బాగా తిను అని ఎంకరేజ్ చేస్తారు. అసలు మనం రోజూ ఎంత తినాలి... ఎన్ని కేలరీలు తినాలి... పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Calories: ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అందర్నీ వేధిస్తోంది. కొంత మంది టెన్షన్లు, జన్యుపరమైన సమస్యలతో లావు అవుతారు. కొంత మంది మాత్రం తినే తిండి వల్లే లావు అవుతారు. తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే... లావు అవ్వకుండా ఉండొచ్చు. మనకు వచ్చే కేన్సర్, హార్ట్ ఎటాక్, బీపీ, షుగర్ వంటి చాలా జబ్బులకు ప్రధాన కారణం అధికబరువే. అందువల్ల ఇప్పుడు మనం రోజూ ఎవరు ఎంత తినాలో తెలుసుకుందాం.

మీకు ఐడియా ఉండే ఉంటుంది... మనం ఏవి తిన్నా మన బాడీలోకి ఎనర్జీ వెళ్తుంది. దాన్నే మనం కేలరీలు అంటాం. మనం పనులు చేస్తున్నప్పుడు ఈ కేలరీల ఎనర్జీ ఖర్చైపోతుంది. సో... తిండికి తగనట్లుగా పని చేస్తూ ఉంటే... బరువు పెరిగే సమస్య ఉండదు. తిండి పెరిగి... పని తగ్గితే... బాడీలో కేలరీలు మిగిలిపోయి అధిక బరువు సమస్య వస్తుంది.

మనం కొనే చాక్లెట్లు, కూల్ డ్రింకులు, కుర్‌కురేలు ఇతరత్రా ప్యాకెట్లపై ఈ కేలరీల లెక్కలు ఉంటాయి. అలాగని ప్రతీదీ కేలరీలు లెక్కలేసుకుంటూ తినలేం. అది కష్టం కూడా. కొంత మంది పెద్దగా తిండి తినరు కానీ లావు అవుతారు. ఎందుకిలా అని డాక్టర్‌ని అడుగుతారు. వాళ్లు భోజనం బదులు స్నాక్స్ ఎక్కువ తింటారు. ఫలితంగా తక్కువ ఆహారం తిన్నా ఎక్కువ కేలరీలు పొట్టలోకి వెళ్తాయి. ఫలితంగా బరువు ఈజీగా పెరుగుతారు.

రోజూ ఎవరు ఎన్ని కేలరీలు పొందాలి అనేదానికి కచ్చితమైన లెక్క లేదు. మనం శ్రమించేదాన్ని బట్టీ మనం తీసుకునేది కూడా ఆధారపడి ఉండాలి. వయసును బట్టి కూడా ఈ లెక్కలు మారుతుంటాయి. పిల్లలు, మహిళలు, ముసలివాళ్లు రోజూ 1,600 కిలోకేలరీలు తీసుకోవాలి. అదే మగవాళ్లు అయితే రోజూ 2,000 కిలో కేలరీలు తీసుకోవాలి. అదే అథ్లెట్లు, రైతులు, కూలీలు అయితే రోజూకు 2,400 కిలోకేలరీలు తీసుకోవాలి. అథ్లెట్లు, రైతులు, కూలీలు చేసే పనులు ఎక్కువ శ్రమతో ఉంటాయి కాబట్టి వారికి ఎక్కువ ఎనర్జీ ఖర్చవుతుంది. కాబట్టే వారు ఎక్కువ కేలరీలు తీసుకోవాలి. ఇదే ఫార్ములా అందరికీ వర్తిస్తుంది. శ్రమను బట్టీ మనం తీసుకునే కేలరీలు ఆధారపడి ఉండాలి.

సరైన ఆహరం తింటే సరైన కేలరీలు డెవలప్ అవుతాయి. అలాగే ఖర్చు కూడా అవుతాయి. ప్రోటన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ వంటివి ఆహార ధాన్యాలు, మాంసం, గుడ్లు, పప్పులు, గింజలు, బద్దలు, డ్రైఫ్రూట్స్ ఇలా అన్నింటిలోనూ ఉంటాయి. మనం పూర్తిగా నూనె పదార్థాలతో తయారైనవే తింటే... కొవ్వు పేరుకుపోయి... కేలరీలు పెరిగిపోయి బరువు ఎక్కువవుతాం. కాబట్టి... కొవ్వును కరిగించే బాదం, నిమ్మరసం, బెల్లం వంటివి కూడా తీసుకోవాలి. తద్వారా వేస్ట్ పదార్థాలు బాడీలో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బాడీ క్లీన్ అవుతుంది.

మీరు బరువు పెరుగుతున్నదీ లేనిదీ తెలియాలంటే... బరువును చూపించే యంత్రంలో కాయిన్ వేసి తెలుసుకోవచ్చు. అలాంటిది మీకు దగ్గర్లో లేకపోతే... మీరు ఓ 3 కిలోమీటర్లు నడవాలి. అలా నడిచినప్పుడు మీకు ఆయాసం ఎక్కువగా వస్తూ ఉంటే... మీరు అధిక బరువు ఉన్నట్లే. అంటే అధిక కేలరీలు ఉన్నట్లే. ఏదో ఒక పని చేసి వాటిని తగ్గించుకోవాలి. నడవాలి, పరుగెత్తాలి, బరువులు మొయ్యాలి, మెట్లు ఎక్కి, దిగాలి, నిల్చోవాలి, ఎక్కువగా నిద్రపోవాలి. ఎక్కువ నిద్రపోతే కూడా బరువు తగ్గుతారు.

చివరిగా ఒక్కమాట. తీపి పదార్థాల్లో అంటే చాక్లెట్లు, ఐస్‌క్రీములు, కేకులు, బిస్కెట్లు, ఆలూ చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిలో కేలరీలు ఎక్కువ ఉంటాయి. బరువు తగ్గాలి అని అనుకోగానే... ముందుగా వీటిని తినడం మానేయాలి. తద్వారా మీకు అధికంగా వచ్చే కేలరీలు తగ్గుతాయి. ఆ తర్వాత ఆల్రెడీ ఉన్న కేలరీలను పనులు చేయడం ద్వారా, పండ్లు, డ్రైఫ్రూట్స్ తినడం ద్వారా తగ్గించుకోవచ్చు.

Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them. 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad