Trending

6/trending/recent

Body Mass Index: మీ BMI సరిచూసుకోండి.. తేడా వస్తే ఇబ్బందులే!. మీ ఎత్తుకు మీరు ఉండాల్సిన బరువు ను తెలుసుకొండి

Body Mass Index:  BMI న్యూఢిల్లీ: కోవిడ్‌ బారినపడిన ఊబకాయులకు రిస్క్‌ ఎక్కువని ఓ అధ్యయనం తేల్చింది. కోవిడ్‌–19 సోకిన ఊబకాయులు ఐసీయూల్లో చేరాల్సి రావడం వంటివి ముప్పును ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా లాన్సెట్‌ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కోవిడ్‌ రిస్క్‌కు, శరీర బరువు(బాడీ మాస్‌ ఇండెక్స్, బీఎంఐ)తో సంబంధమున్నట్లు మొట్టమొదటిసారిగా చేపట్టిన తమ విస్తృత అధ్యయనంలో రుజవైందని యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఒక వ్యక్తి బరువు(కిలోగ్రాములు), అతని ఎత్తు(మీటర్లు)ను భాగించడం ద్వారా శరీరంలోని కొవ్వును బీఎంఐ ద్వారా లెక్కిస్తారు.

ఇంగ్లండ్‌లోని 69 లక్షల మంది ప్రజలతోపాటు కోవిడ్‌తో ఆస్పత్రి పాలైన 20 వేల మంది బాధితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని పరిశోధకులు తెలిపారు. బీఎంఐ 23 కేజీ/ఎం2(కిలోగ్రాములు పర్‌ స్క్వేర్‌ మీటర్‌) ఉంటే దానిని ఆరోగ్యకరమైన స్థాయిగా భావిస్తారు. దీనికి మించి ఒక్క యూనిట్‌ ఎక్కువున్నా కోవిడ్‌తో పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చేరే అవకాశం 5 శాతం, ఐసీయూలో చేరే చాన్స్‌ 10 శాతం పెరుగుతుందని  తెలిపారు. బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉన్న వారికీ కోవిడ్‌–19తో రిస్క్‌ ఎక్కువేనని వారు వివరించారు. ఇలాంటి రిస్క్‌ 20–39 ఏళ్ల మధ్య వారిలో అత్యధికం కాగా, 60 ఏళ్ల వారి నుంచి తగ్గుతుందని వెల్లడించారు. 19 ఏళ్లలోపు వారితోపాటు 80 ఏళ్లపైబడిన కోవిడ్‌ బాధితుల్లో బీఎంఐ చూపే ప్రభావం తక్కువని తెలిపారు. మొత్తమ్మీద చూస్తే 20–39 ఏళ్ల వారిలో మిగతా వయస్సు గ్రూపుల వారితో పోలిస్తే కోవిడ్‌ ప్రభావం తక్కువగానే ఉందని వెల్లడించారు.

మీ ఎత్తుకు మీరు ఉండాల్సిన బరువు ను ఈ క్రింది చార్ట్ లో తెలుసుకొండి

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad