Trending

6/trending/recent

AP Cabinet: ఏపీ కేబినెట్ మీటింగ్ మరోసారి వాయిదా.. కారణాలు ఇవేనా...?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ (Andhra Pradesh Cabinet) సమావేశానికి ముహూర్తం కుదరడం లేదు. దీంతో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మరోసారి వాయిదా పడింది. గురువారం జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సీఎంఓ ప్రకటించింది.
మే 4వ తేదీన సచివాలయంలోని 1న బ్లాక్ కేబినెట్ మీటింగ్ హాల్లో సమావేశం జరుగుతుందని సీఎంఓ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.
కేబినెట్ మీటింగ్ వాయిదా పడటం ఇది రెండోసారి. తొలుత ఈనెల 22 మంత్రివమండలి సమావేసముంటుందని అధికారులు ప్రకటించారు.
ఆ తర్వాత సమావేశాన్ని ఈనెల 29(గురువారం)కి వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. ఐతే సమావేశం వాయిదా పడటానికి కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.
ఐతే చివరి నిముషంలో కేబినెట్ సమావేశం వాయిదా పడటం చర్చనీయాంశమవుతోంది. సచివాలయంలో కరోనా కేసుల కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నిర్వహించాలని భావించారు. ఆ తర్వాత మీటింగ్ సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఉంటుందన్న ప్రచారం కూడా జరిగింది. చివరకు సెక్రటేరియట్ లోనే నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
సమావేశం వాయిదా పడటానికి కారణాలేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులపై మరింత లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకే కేబినెట్ వాయిదా పడిందన్న చర్చ జరుగుతోంది.
ఇప్పటికే కరోనా కట్టడి, లాక్ డౌన్ ఆంక్షలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం, వ్యాక్సిన్ డోసుల లభ్యత, కరోనా చికిత్స, సౌకర్యాలు, ఆక్సిజన్ లభ్యత లాంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad