Trending

6/trending/recent

AP Cabinet meeting: రేపు ఏపీ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం.. కరోనా తీవ్రత, మినీ లాక్‌డౌన్‌పై కీలక చర్చ!

రాష్ట్రంలో క్రమంగా క‌రోనా పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ స‌మావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

AP Cabinet meeting: రాష్ట్రంలో క్రమంగా క‌రోనా పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ స‌మావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 29వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధ్యక్షత‌న జ‌ర‌గ‌నున్న ఏపీ కేబినెట్ స‌మావేశంలో.. క‌రోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్చలపైనే ప్రధానంగా చ‌ర్చించి కీల‌క నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొర‌త వెంటాడుతుండ‌గా.. వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేయ‌డంపై కూడా దృష్టిసారించ‌నుంది రాష్ట్ర ప్రభుత్వం. రికార్డు స్థాయిలో పెరుగుతున్న క‌రోనా రోగుల‌కు అందుతున్న వైద్య స‌దుపాయాల‌పై చ‌ర్చించ‌నున్న సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఆక్సిజ‌న్, బెడ్లు, రెమిడెసివిర్ కొర‌త వంటి అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశాలున్నాయి. వీటితో పాటు ప‌లు కీల‌క ఎజెండాల‌పై రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ కీలక భేటీ జరుగుతుంది. రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌, వ్యాక్సినేషన్‌పై చర్చిస్తారు మంత్రులు. మినీలాన్‌డౌన్‌పై కేంద్ర మార్గదర్శకాలపై కూడా మంత్రుల కమిటీ చర్చించబోతున్నారు. ఏపీలో కరోనా విలయతాండవం కారణంగా మినీలాక్‌డౌన్‌తో పాటు కొత్త ఆంక్షలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సూచనలపై సమీక్షించిన తరువాత ముఖ్యమంత్రి జగన్‌కు సబ్‌కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా రేపు జరగనున్న ఏపీ కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad