Trending

6/trending/recent

Andhra Pradesh: నెల నెలా జీతమంతా భర్తకే ఇస్తున్నా ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి తప్పని వేధింపులు

నెల నెలా వచ్చే జీతమంతా ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన భర్త చేతుల్లోనే పెట్టేది. అయినా అత్తారింట్లో ఆమెకు వేధింపులు తప్పలేదు. చివరకు తన కోసం వచ్చిన తండ్రికి అత్తారింట్లో అవమానం జరిగిందని..

ఏపీఎస్ అధికారికి కూడా గృహహింస తప్పని ఘటన గురించి మీరు చదివే ఉంటారు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. చదువులు చెప్పే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అత్తింట్లో వేధింపులను భరించలేకపోయింది. పెళ్లయిన మూడో నెల నుంచే భర్త వేధింపులు, అదనపు కట్నం కోసం అత్తమామల సాధింపులను భరించలేకపోయింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ నెల నెలా జీతం అంతా భర్త చేతుల్లోనే పెడుతున్నప్పటికీ ఆమెకు వేధింపులు ఆగలేదు. పైగా నచ్చజెప్పడానికి వచ్చిన తన తండ్రికి అత్తింట్లోనే తీవ్ర అవమానం జరిగింది. దీన్ని భరించలేని ఆ ఉపాధ్యాయురాలు మనస్తాపం చెందింది. తన మరణానికి భర్త, అత్తమామలే కారణమని లేఖ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన గజఫర్ అలీ అనే వ్యక్తికి 30 ఏళ్ల వయసున్న సల్మా అనే కుమార్తె ఉంది. ఆమెకు అయిదేళ్ల క్రితమే మదనపల్లెకు చెందిన ఇంతియాజ్ తో వివాహం అయింది. అప్పటికే ఆమె తరిగొండ ప్రాధమికోన్నత పాఠశాలల్లో ఉర్దూ టీచర్ గా పనిచేస్తోంది. పెళ్లి సమయంలో కట్నకానుకలను అడిగినంత ఇచ్చారు కూడా. అయితే పెళ్లయిన మూడు నెలల నుంచే సల్మాకు అత్తారింట్లో చిక్కులు మొదలయ్యాయి. అదనపను కట్నం తీసుకురావాలంటూ సల్మాను భర్త వేధించసాగారు. అత్తమామలు, ఆడబిడ్డలు కూడా ఆమెను తీవ్రంగా వేధించసాగారు. పెళ్లయిన నాటి నుంచి జీతం అంతా వాళ్లే తీసుకునేవాళ్లు. చార్జీలకు, ఇతర అవసరాలకు కూడా భర్తనే అడిగి తీసుకునేది. భర్త నుంచి వేధింపులు మొదలవడంతో ప్రభుత్వ ఉద్యోగస్తురాలిగా బ్యాంకుల్లో రుణం తీసుకుని భర్తకు ఇచ్చినా వేధింపులకు పులుస్టాప్ పడలేదు.

దీంతో మూడు రోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లి తండ్రికి తన బాధను చెప్పుకుని బోరున విలపించింది. అదే రోజు కుమార్తెతో పాటు అల్లుడి ఇంటికి మామ వెళ్లాడు. అదనపు కట్నం కోసం వేధించడం తగదని హితవు పలికాడు. అడిగినంత కట్నం ఇచ్చినా, నెల నెలా అమ్మాయి జీతమంతా మీకే ధారపోస్తున్నా, లోన్లు తీసుకుని మరీ డబ్బిచ్చినా ఇంకా వేధించడమేంటని ప్రశ్నించాడు. గజఫర్ అలీకి అల్లుడి ఇంట్లో చేదు అనుభవమే ఎదురయింది. పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా చేయి చేసుకోబోయాడు. తీవ్రంగా దూషించారు. దీంతో అదే రోజు తన తండ్రితో కలిసి సల్మా పుట్టింటికి వచ్చింది. అత్తారింట్లో తండ్రికి జరిగిన చేదు అనుభవం గురించే బాధపడుతూ మనస్తాపం చెందింది. శుక్రవారం ఇంట్లోనే తన గదిలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి భర్త, అత్తమామలు, ఆడబిడ్డలే కారణమని సూసైడ్ లేఖను కూడా రాసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad