Trending

6/trending/recent

Andhra pradesh: ఏపీలో ఉద్యోగుల ఎదురుచూపు. ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపినా అందని జీతాలు

ఏపీలో ఉద్యోగులు, ఫించనుదార్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. మార్చి నెల జీతాలు ఇంకా అకౌంట్లో పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జీతాలు ఆలస్యం కావడానికి ఖజానాలో సొమ్ము లేకపోవడానికి తోడు, అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమని తెలుస్తోంది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదా? ఇప్పటికే రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉంది. రోజు రోజుకు అప్పుల భారం పెరుగుతోందని కాగ్ సైతం మండిపడుతోంది. ఇదే సమయంలో ప్రతి నెల ఒక సంక్షేమ పథకం పేరుతో భారీగా నిధులు విడుదల చేస్తున్నారు. మరి ఉద్యోగుల మాట ఏంటి? ఎంతకాలం ఈ ఎదురుచూపులు అనే ఆందోళన పెరగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. మార్చి నెల జీతాలు నాలుగో తేదీ వచ్చినా పకడకపోయే సరికి వారిలో ఆందోళన పెరుగుతోంది. సుమారు 5 లక్షల మందికిపైగా ఉద్యోగులు, లక్షల మంది ప్రభుత్వ పింఛనుదారులు జీతం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఫించనుదార్లకు ప్రతి నెల మొదటి రెండు రోజుల్లోనే జీతాలు, పెన్షన్లు పడాలి. ఇటీవల తరుచూ డేట్ మారడంపై అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మార్చి నెల జీతలు..  ఏప్రిల్ ప్రారంభమై నాలుగు రోజులైనా అందకపోవడంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది. ఏప్రిల్ 1వ తేదీన ఆర్థిక సవంత్సరం, ఏప్రిల్ రెండున గుడ్ ఫ్రైడే.. దీంతో కచ్చితంగా మూడో తేదీ అయిన శనివారం జీతం పడుతుందని అంతా భావించారు. మళ్లీ ఆదివారం సమస్య వస్తుందని కచ్చితంగా శనివారం సాయంత్రంలోపు జీతం పడుతుందని ఆశగా ఎదురు చూశారు. కానీ వారికి నిరాశేమిగిలింది.

జీతాలు పడకపోవడానికి ప్రధాన కారణం ఖజానాలో చాలినంత సొమ్ము లేకపోవడమే అని తెలుస్తోంది. దానికి తోడు ఆర్ధిశాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమని ప్రచారం ఉంది. ఖజానాలో సొమ్ము లేదనే విషయం తెలిసినవెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కానీ ఇప్పటి వరకు ఆర్థికశాఖ నుంచి రిజర్వ్ బ్యాంకుకు సంబంధిత బిల్లులు చేరలేదని తెలుస్తోంది. సాధారణంగా  ప్రతినెలా 25 కల్లా ఖజానా కార్యాలయాలకు వాటిని పంపిస్తారు. అక్కడ వాటిని పరిశీలించి సీ.ఎఫ్.ఎం.ఎస్​కు సమర్పిస్తారు.తరువాత ఆర్థికశాఖ అధికారులకు బిల్లులను చేరవేస్తారు.

నిధుల లభ్యతను బట్టి ఆర్థికశాఖ అధికారులు చెల్లింపులు చేస్తారు. ఈ ఏడాది బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపకపోవడంతో కొత్త ఆర్థిక సంవత్సరంలో జీతాలు, ఇతరత్రా చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ రూపంలో ఆర్డినెన్సు తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందినా జీతాలు, పింఛన్లకు సంబంధించి ఆయా హెడ్‌లలో ఎంట్రీలు పూర్తి చేయక పోవడం వల్ల చెల్లింపులకు ఇబ్బంది ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వరుసగా సెలవులు రావడంతో ఎంట్రీలు నమోదు కాలేదని సమాచారం.

ఏపీ వ్యాప్తంగా అందరికీ జీతాలు, పింఛన్‌ చెల్లింపులకు ఎంత లేదన్నా దాదాపు 5 వేల కోట్ల కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు బిల్లులు అందలేదు. దీనికి తోడు ఆదివారం, సోమవారం కూడా సెలవులు కావడంతో కనీసం ఆరో తేదీనైనా జీతాలు అందుతాయా అని ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఆ తరువాత వరస సెలవులు ఉండడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్యోగలు, పింఛనదార్ల సంగతి అలా ఉంచితే.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు అయినవారికి జనవరి నెల జీతాలు కూడా పడలేదని తెలుస్తోంది. దీంతో జీతాల కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. ఎన్నాళ్లీ కష్టాలు అని తలలు పట్టుకుంటున్నారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad