Trending

6/trending/recent

Telangna PRC: పీఆర్సీ మీద కేసీఆర్ కీలక ప్రకటన

పీఆర్సీ మీద కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో స్ఫూర్తిమంతమైన భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధతతో పాలు పంచు కుంటున్నారని వీరందరి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి పథకాల ఫలాలు ప్రజలకు విజయవంతంగా అందుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగులతో ప్రభుత్వానికున్న అవినాభావ సంబంధం రీత్యా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని, ఉద్యోగులందరి హక్కులు గౌరవిస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను అభినందిస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇంక్రిమెంట్ ప్రకటించింది. 2014లో పదో వేతన సవరణ చేస్తూ 43శాతం అత్యధిక ఫిట్ మెంటును ప్రకటించింది.
ఆర్థిక వ్యవస్థ ఇపుడిపుడే తేరుకుంటున్న సందర్భంలో రాష్ట్రంలోని అందరు ఉద్యోగ, ఉపాధ్యాయులకు వర్తించే విధంగా మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. వేతన సవరణ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చేసే పద్ధతిని గత ప్రభుత్వాలు అవలంబించాయి అని, కానీ తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే, క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను, స్థితి గతులను దృష్టిలో పెట్టుకొని, మానవీయ కోణంలో వారి వేతనాలు కూడా పెంచిందని అన్నారు. ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీ.ఆర్.ఏలు, వీ.ఏ.ఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్కు చార్జ్ డ్, డెయిలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ అలా మొత్తం రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగా ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తున్నామని శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 80 శాతం ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియ పూర్తయింని, మిగతా అర్హులైన ఉద్యోగులతోపాటు, అర్హులైన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుందని పేర్కొన్నారు ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని 100 శాతం అర్హులైన ఉద్యోగులందరు ప్రమోషన్లు పొందుతారని అన్నరు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందని అన్నాారు.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad