Trending

6/trending/recent

Telangana: తెలంగాణలో పాక్షిక లాక్‌డౌన్..? త్వరలో సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కేసులు వస్తుండడంతో.. విద్యా సంస్థల మూసివేతపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్‌తో ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. తెలంగాణలోనూ కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా స్కూళ్లలో ఎక్కువ కేసులు నమోదవున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. పాక్షిక లాక్‌డౌన్ అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శని, ఆది వారాల్లో హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వారంలో 2 రోజులు లాక్‌డౌన్ లేదా రాత్రి పూట కర్ఫ్యూ విధించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కేసులు వస్తుండడంతో.. విద్యా సంస్థల మూసివేతపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్లు, పార్క్‌లు, జనాల రద్దీ ఉండే ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలని భావిస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో మార్చి 26 కంటే ముందే అసెంబ్లీ సమావేశాలను ముగించే యోచనలో ఉన్నారు. కరోనాపై త్వరలోనే సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని.. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. 

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 394 మందికి కరోనా సోకింది. శనివారం 64,898 టెస్టులు చెయ్యగా 394 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,03,118కి చేరింది. కొత్తగా కరోనాతో ముగ్గురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,669కి చేరంది. మరణాల రేటు 0.55 శాతం ఉంది. తాజాగా 194 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,98,645కి చేరింది. రికవరీ రేటు 98.52 శాతానికి చేరింది. ప్రస్తుతం 2,804 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వాటిలో 1123 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. GHMC పరిధిలో 81 కేసులు వచ్చాయి.

 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad