Trending

6/trending/recent

PAN Aadhaar Link Status: మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయిందా? ఒక్క నిమిషంలో తెలుసుకోండిలా

PAN Aadhaar Link Status | పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఇంకొన్ని గంటలే గడువుంది. ఇప్పటికీ కోట్లాది మంది పాన్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయలేదు. మరి మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో ఒక్క నిమిషంలో తెలుసుకోండి ఇలా.
1. ఆదాయపు పన్ను శాఖ ముందే ప్రకటించినట్టుగా 2021 మార్చి 31 లోగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. ఆ తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి ఎప్పుడు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసినా రూ.1,000 జరిమానా చెల్లించాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం) 

2. గడువు తర్వాత పాన్, ఆధార్ నెంబర్స్ లింక్ చేస్తే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించిన సంగతి తెలిసిందే. 

3. చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశం లేదు. ఇప్పటికే చాలాసార్లు పాన్, ఆధార్ లింకింగ్ కోసం గడువు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. చివరిసారిగా 2021 మార్చి 31 వరకు గడువు పొడిగించింది. ఈ గడువు ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. 

4. అయితే ఇప్పటికే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసినవాళ్లు ఉన్నారు. అలాంటివారంతా ఓసారి స్టేటస్ చెక్ చేసుకోవాలి. తమ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలి.

5. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడం చాలా సింపుల్. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఈజీగా పాన్, ఆధార్ లింకింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

6. పేజీలో PAN అని ఉన్న బాక్సులో పాన్ నెంబర్, Aadhaar Number అని ఉన్న బాక్సులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓసారి పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ తెలుసుకోవాలి.

7. ఆ తర్వాత View Link Aadhaar Status పైన క్లిక్ చేయాలి. Your PAN linked to Aadhaar Number అని మెసేజ్ కనిపిస్తే ఆధార్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అయినట్టే. ఏ ఆధార్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అయిందో కూడా తెలుస్తుంది. ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి. 

8. మీ ఫోన్ నుంచి కూడా పాన్, ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు ఇందుకోసం మీరు UIDPAN < 12 digit Aadhaar number> < 10 digit Permament Account Number> అని ఎస్ఎంఎస్ టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad