Trending

6/trending/recent

No Mask Fine in AP: ఏపీ పోలీస్ ఆన్ డ్యూటీ.. మాస్క్ వేసుకోని వారి నుండి ఒక్కరోజే 17.34 లక్షలు వసూలు !

No Mask Fine in AP: ఏపీలో కరోనా కేసులు పెరగడంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్ ధారణ పై పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం ఒక్క రోజునే మాస్కులు ధరించని 18,565 మందికి పోలీసులు ఫైన్ లు వేసి, ఫైన్ ల ద్వారా రూ. 17.34 లక్షలు వసూలు చేశారు. అత్యధికంగా ప్రకాశం పోలీసులు రూ. 2,10,110 వసూళ్లు చేశారు. అలాగే అత్యల్పంగా రాజమండ్రి అర్బన్ పోలీసులు రూ. 2800 వసూలు చేశారు. ఇక ఏపీలో కరోనా విలయం సృష్టిస్తూనే ఉంది. నిన్న ఏకంగా వెయ్యికి చేరువలో వెళ్లిన కరోనా పాజిటివ్ కేసులు..ఇవాళ వెయ్యి దాటేశాయి కరోనా కేసులు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 31,142 శాంపిల్స్ పరీక్షించగా.. 1005 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గతేడాది నవంబర్ 26 తర్వాత వేయి కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక గత 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. అదే సమయంలో 324 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,98,815కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 8,86,216కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 5394 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 7,205 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 1,49,90,039 సాంపిల్స్ ని పరీక్షించినట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad