Trending

6/trending/recent

Hero Nyx-HX Scooter: 200 కి.మీ. మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్... గ్రేట్ ఆఫర్‌...

Hero Nyx-HX scooter: ఎలక్ట్రిక్ స్కూటర్... అది కూడా హీరో కంపెనీ నుంచి రావడంతో... దీనికి క్రేజ్ పెరిగింది. మరి కొత్త ఆఫరేంటి.. ధర ఎంత, ఫీచర్లు అన్నీ తెలుసుకుందాం.

Hero Nyx-HX scooter: ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్లు తయారుచేసే అతి పెద్ద కంపెనీ హీరో ఎలక్ట్రిక్... సరికొత్త స్కూటర్‌ను తెచ్చింది. అది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్లగలదు. స్కూటర్ పేరు నిక్స్ హెచ్ ఎక్స్. ప్రారంభ ధర రూ.64,640. కంపెనీ ప్రకారం... ఈ స్కూటర్‌ను న్యూ సిటీ స్పూడ్ సెగ్మెంట్‌లో తయారుచేశారు. ఇందులో ఆప్టిమా HX, నిక్స్ HX, ఫోటాన్ HX అనే మోడల్స్ ఉన్నాయి.

లుక్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉండేలా తయారుచేయడం దీని ప్రత్యేకత. అంటే పొడవు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఇలా ఎందుకు చేశారంటే... సామాన్లు మోసుకెళ్లడానికి ఈజీగా ఉండాలని చేశారు.

ఈ స్కూటర్లలో మోడల్‌ని బట్టీ ఒకసారి చార్జ్ చేస్తే... 82 కిలోమీటర్ల నుంచి 210 కిలోమీటర్ల దాకా వెళ్లేవి ఉన్నాయి. ఇందులో ప్రారంభ మోడల్ 82 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్ మోడల్ 210 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ చెప్పింది.

ఈ స్కూటర్లలో టాప్ స్పీడ్‌తో వెళ్లే నిక్స్ హెచ్ ఎక్స్... హై స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు. అంతకంటే వేగంగా వెళ్లదు. అంటే ఇది సిటీలో ప్రయాణించేవారికి బాగా సెట్ అవుతుంది అనుకోవచ్చు.

దీని పొడవు 1,970 మిల్లీమీటర్లు ఉండగా... వెడల్పు 745 మిల్లీమీటర్లు ఉంది. ఎత్తు 1,145 మిల్లీమీటర్లు ఉంది. బరువు 755 కేజీలు.  

దీనికి డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. వెనక రైడర్‌కి మూడు గ్రాబ్ రెయిల్స్ ఉన్నాయి. ఓ బాటిల్ హోల్డర్ ఉంది.

ఈ స్కూటర్ 0.6 kW ఎలక్ట్రిక్ మోటర్‌తో పవర్ అవుతోంది.

దీనికి 1.536 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇస్తున్నారు.

ఎలక్ట్రిక్ స్కూటర్లపై హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఢిల్లీలో ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తోంది. ఈ ఆఫర్లు మార్చి 31 వరకూ ఉంటాయి.

ఆప్టిమా హెచ్ఎస్ (Optima HX) ఎక్స్ షోరూం ధర రూ.74,640. ఐతే మీరు ఆప్టిమా హెచ్ ఎక్స్ (డ్యూయల్ బ్యాటరీ Dual Battery)ని రూ.54,990కి కొనవచ్చు. అలాగే... ఆప్టిమా HXని రూ.49,860కి కొనవచ్చు. ఇలా ఆఫర్‌లో లభిస్తున్నాయి.

ఈ కొత్త స్కూటర్లు కొన్న వారికి రూ.7000 దాకా ఫెస్టివల్ క్యాష్ బెనెఫిట్స్ లభిస్తున్నాయి. వీటిలో డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ టాపప్, లాయల్టీ టాపప్, కార్పొరేట్ టాపప్ ఉన్నాయి. వాటితోపాటూ... అదనపు బెనెఫిట్స్ బొనాంజా కూడా ఉంది. ఎవరైనా హీరో బైక్ లేదా స్కూటర్‌ను ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో పొందాలనుకుంటే... డౌన్ పేమెంట్ రూ.4999 ఉంది. వడ్డీ రేటు రూ.6.99గా నిర్ణయించింది కంపెనీ.

మరిన్ని వివరాలకు ఈ లింక్ ఓపెన్ చెయ్యండి. https://heroelectric.in/nyx-2

 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad