Trending

6/trending/recent

ఆ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. సులభంగా డిగ్రీ పూర్తి చేసేందుకు ‘వన్ టైం ఛాన్స్’.. దరఖాస్తుకు మూడు రోజులే గడువు DEGREE BACKLOG CHANCE

Osmania University: ఏళ్ల క్రితం డిగ్రీ చదివి సబ్జెక్టులన్నీ పాస్ కాలేక పోయి.. పట్టా అందుకోలేక పోయిన విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చాలా మంది ఏళ్ల క్రితం డిగ్రీ చదివి.. వివిధ పరిస్థితుల నేపథ్యంలో నిర్ణీత గడువులోగా సబ్జెక్టులన్నీ పాస్ కాలేక పట్టాను అందుకోలేకపోతారు. గడువు పూర్తి కావడంతో వారి డిగ్రీ క్యాన్సెల్ అవుతుంది.

దీంతో అలాంటి వారు మళ్లీ డిగ్రీ పట్టా పొందాలంటే నూతనంగా మళ్లీ అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఉస్మానియా యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది.

యూనివర్సిటీ పరిధిలో గతంలో బ్యాక్ లాగ్స్ ఉండి డిగ్రీ(అండర్ గ్రాడ్యుయేషన్) పట్టా పొందలేకపోయిన విద్యార్థులకు ‘వన్ టైం ఛాన్స్’ కల్పిస్తోంది. రీ అడ్మిషన్ పొందకుండా గతంలో మిగిలిన సబ్జెక్టులకు మాత్రమే ఫీజులు చెల్లించి పరీక్షలను రాసే అవకాశం కల్పించింది.

30 ఏళ్ల క్రితం డిగ్రీ చదివి అప్పట్లో సబ్జెక్టులు మిగిలి పోయిన వారు కూడా పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం విద్యార్థులు అప్లై చేసుకోవడానికి మార్చి 15 వరకు గడువు విధించారు.ఇందు కోసం సబ్జెక్టులు, డిగ్రీ చదివిన సంవత్సరం ఆధారంగా అధికారులు ఫీజులు నిర్ణయించారు. 2002-2012 మధ్య డిగ్రీ చదివి బ్యాక్ లాగ్ లు ఉన్న విద్యార్థులైతే సబ్జెక్టుకు రూ. 6 వేలతో పాటు రెండు పేపర్ల వరకు అదనంగా రూ.710, మూడు పేపర్లు ఆ పైనా ఉంటే అదనంగా రూ.1010 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.1988-2002 మధ్య విద్యార్థులైతే సబ్జెక్టుకు రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 200 ఆలస్య రుసుంతో మార్చి 19 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.వివరాలకు యూనివర్సిటీ ఎగ్జామ్ బ్రాంచ్ ను సంప్రదించాలని లేదా యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.ఇదిలా ఉంటే యూనివర్సిటీ గతంలో బ్యాక్ లాగ్స్ మిగిలిపోయిన విద్యార్థుల కోసం వన్ టైం చాన్స్ కల్పించడంపై విద్యార్థుల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నా.. ఫీజులు భారీగా నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.దీనిపై ఓ విద్యార్థి కోర్టును సైతం ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే కోర్టు ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే ఆ మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు.

ఆ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. సులభంగా డిగ్రీ పూర్తి చేసేందుకు ‘వన్ టైం ఛాన్స్’.. దరఖాస్తుకు మూడు రోజులే గడువు DEGREE BACKLOG CHANCE

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad