Trending

6/trending/recent

Andhra Pradesh Heat Wave Alert: ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. ఏపీ విపత్తుల శాఖ అలర్ట్

ANDHRA PRADESH STATE DISASTER MANAGEMENT: మార్చి ప్రారంభం నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా పెరుగాయి. రోజురోజూకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఏపీలో కోస్తా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయని.. వడగాల్పుల ప్రమాదం కూడా పొంచిఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచనలు చేసింది.

ఏపీలో మొత్తం 670 మండలాలు ఉండగా.. ఈ రోజు 9మండలాల్లో వడగాలుల ప్రభావం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. రాగల 48 గంటల్లో కొన్ని మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని సూచనలు చేసింది. అయితే కొన్ని చోట్ల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండలకు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

ఐఎండీ సూచనల ప్రకారం.. రాగల 48గంటల్లో తీవ్ర వడగాల్పులు సంభవించే మండలాల వివరాలు..

శ్రీకాకుళం:
భీమిలి

తూర్పుగోదావరి:
రాజవొమ్మంగి
అడ్డతీగల

పశ్చిమ గోదావరి:
కుక్కునూరు 

వీటితోపాటు మరికొనని మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ ను ఓపెన్ చేయండి..


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad