Trending

6/trending/recent

నేటి నుంచి విద్యార్థులకు ‘సండే స్టోరీ టైమ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 5 : అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పఠనానైపుణ్యాలను పెంపొందించేందు కు ఇక మీదట ప్రతి ఆదివారం స్థానికంగా ఉండే పబ్లిక్‌ లైబ్రరీలు/ కాలనీలు/ వీధులు/వార్డుల్లో పిల్లలను సమావేశపర్చి పఠనాకృత్యాలను నిర్వహించాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.  ‘సండే స్టోరీ టైమ్‌’ పేరిట నిర్వహించే ఈ కా ర్యక్ర మం నిర్వహణకు స్కూలు హెచ్‌ఎంలు, టీచర్లు స్వచ్ఛందంగా సహకరించాలని, అయితే వారి హాజరు నిర్బంధం కాదని స్పష్టం చేసింది. స్థానికంగా ఉన్న పబ్లిక్‌ లైబ్రరీలు/బుక్‌ కలెక్షన్‌ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న గ్రంథ పాలకులు, సచివా లయ వలంటీర్లు, ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, సమగ్ర శిక్షా సీఆర్‌పీలకు నిర్వహ ణ బాధ్యతలను అప్పగించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కూడా నిరంతర పఠనం అలవాటుగా చేయాలనేదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని డీఈవో సీవీ రేణుక తెలిపారు. ఇకమీద ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యార్థులందరూ సామూహిక పఠన కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. 

SUNDAY STORY TIME

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad