Trending

6/trending/recent

నాడు-నేడు పనులతో ఒత్తిడి: ఫ్యాప్టో

న్యూస్ టోన్, అమరావతి: ‘నాడు-నేడు’ పనులతో ప్రధానోపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఛైర్మన్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పనులు ముగియకుండానే తుది విడత బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో పని చేసినందుకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని కోరారు.

15 లోపు నాడు-నేడు పనులను పూర్తి చేయాలి

నాడు-నేడుకు సంబంధించిన అన్ని పనుల ను ఈనెల 15లోపు పూర్తి చే యాలని ప్రధానోపాధ్యాయు లను జిల్లా విద్యాశాఖాధి కారి వి.ఎస్‌. సుబ్బారావు ఆదే శిం చారు. మండల విద్యావనరుల కేంద్రంలో శనివారం మనబడి, నాడు-నేడు కార్యక్రమాలపై హెచ్‌ ఎంలతో ఆ యన సమీక్ష నిర్వహించారు. జల జీవన్‌ మిషన్‌ పథకం కింద  అన్ని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం  కల్పించేందుకు ఆర్‌డ బ్ల్యూఎస్‌ ద్వారా పైప్‌లైన్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పను లకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎం ఈవోలు రాందాస్‌ నాయక్‌, సుజాత పాల్గొన్నారు.

PRESSURE BY NADU NEDU WORKS

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad