Trending

6/trending/recent

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం

  • శాసనమండలిలో చర్చకు మంత్రి బుగ్గన జవాబు

న్యూస్ టోన్, అమరావతి: అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 27 శాతం మధ్యంతర భృతి మలు చేశామని, తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా ప్రాధాన్యతల ప్రకారం సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు, సౌకర్యాల విషయంలో ఒకే రకమైన విధానం ఉండాలన్న వినతిపై ప్రభుత్వం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 'ఉద్యోగుల సంక్షేమం- ప్రభుత్వ విధానం' పై శాసనమండలిలో గురువారం స్వల్పకాలిక చర్చకు మంత్రి జవాబిచ్చారు. బుగ్గన ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ. గత సర్కారు పెండింగ్లో పెట్టినవి కూడా...

2019 నుంచే దేశమంతా ఆర్థిక వ్యవస్థ మందగించింది. కరోనాతో చావుదెబ్బ తగిలిం ది. రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా తగ్గిపోయింది. కాస్త ఆలస్యమైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఉద్యోగులు, పింఛనుదారులందరికీ శాతం ఐఆర్ ను అమలు చేయడం ద్వారా ఏడాదికి రూ.9,291.71 కోట్లు అదనంగా ఖర్చు అవుతున్నా ఎన్నికల హామీకి కట్టుబడి సీఎం అమలు చేశారు. పూర్తి స్థాయి పీఆ రసీ అమలుకు చర్యలు చేపడుతున్నాం. టీడీపీ సర్కారు 2018 నుంచి ఉద్యోగులకు పెండింగ్లో పెట్టిన డీఏలు కూడా మేం ఇస్తాం. సీపీఎస్ రద్దు, అర్హత కలిగిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలపై మంత్రులు, అధికారుల కమిటీల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి

గౌరవ వేతనాలు భారీగా పెంపు: అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న ఆశా కార్య కర్తలు, గిరిజన సామాజిక హెల్త్ వర్కర్లు, మున్సిపల్ అవుట్ సోడ్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు, మెప్మా ఆర్పీలు, సెర్ప్ వీవోఏలు, హోంగార్డులు, మధ్యాహ్న భోజన కుక్ కం హెల్పర్, అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికా రంలోకి రాగానే భారీగా పెంచింది. మొత్తం 3,18, 804 మందికి జీతాల పెంపు ద్వారా ఏటా రూ.1,185 కోట్ల మేర అదనంగా ఖర్చవుతున్నా భరిస్తాం. ఆశా వర్కర్ల జీతం రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు, కేవలం రూ.400 జీతంతో పనిచేస్తున్న గిరిజన సామాజిక హెల్త్ వర్కర్లకు రూ.4 వేలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.12 వేల నుంచి 18 వేల మేర పెంచాం. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏపీలో 4 లక్షలకు పైగా కొత్తగా ఉద్యోగాలు కల్పించాం.

EMPLOYEE WELFARE IS THE AIM

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad