Trending

6/trending/recent

సిపిఎస్ రద్దు చేయండి

మండలిలో పిడిఎఫ్ డిమాండ్

అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం(సిపిఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని పిడిఎఫ్ సభ్యులు డిమాండ్ చేశారు. 'ఉద్యోగుల సంక్షేమం-ప్రభుత్వ విధానం' పై శాసన మండలిలో గురువారం జరిగిన చర్చలో పిడిఎఫ్ పక్షనేత వి బాలసుబ్రహ్మణ్యం, సభ్యులు ఐ వెంకటేశ్వరరావు, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. సిపిఎసను వారం రోజుల్లో రద్దు చేస్తామని వైసిపి ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా కమిటీలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం సిపిఎస్ అవసరం లేదని అసెంబ్లీలో తీర్మానించిందని, రాష్ట్రప్రభుత్వం కూడా ఇలాంటి తీర్మానం చేస్తుందా అని ప్రశ్నించారు. ఎప్పటిలోగా సిపిఎస్ రద్దు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 జులై 1 నుంచి 11వ పిఆర్సి ఉద్యోగులకు అమలు కావాల్సి ఉందని, దీనిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలనికోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలతో ప్రభుత్వం చర్చించలేదని గుర్తుచేశారు. కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ విధానంపై ఒక పాలసీ ప్రకటించాలని కోరారు. కరోనా కాలంలో ప్రైవేట్ విద్యరంగంలో పనిచేసే 3లక్షల మంది సిబ్బందికి జీతాలు అందలేదని, వారిని ఆదుకోవాలని కోరారు ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు రాష్ట్రప్రభుత్వం నియమించిన వర్కింగ్ కమిటీ పరిశీలనలో ఉందని చెప్పారు.

ABOLISH CPS DEMAND
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad