Trending

6/trending/recent

కరోనా వైరస్ తో హెచ్ఎం దంపతుల మరణం

గుంటూరు, నవంబరు 28: గుంటూరుకు చెందిన ప్రధానోపాధ్యాయ దంపతులు కరోనాతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. విను కొండ పట్టణానికి చెందిన జి.బ్రహ్మానందరాజు(53), దుర్గారాణి(50) దంపతులు. బ్రహ్మానందరాజు విను కొండలోని హనుమాన్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా, దుర్గారాణి వెంకుపాలెం పాఠశాలలో హెచ్ఎంగా ఉన్నారు. కొద్ది రోజుల నుంచి నాడు-నేడు పనుల పర్యవేక్షణ, ఎండీఎం లెక్కలు తదితర పనులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో వారికి కరోనా సోకడంతో దుర్గారాణి ఈ నెల 19న బ్రహ్మానందరాజు ఈ నెల 27న మృతి చెందారు. ఈ విషయంపై శనివారం జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకు మారు 'ఆంధ్రజ్యోతి' ప్రశ్నించగా.. హెచ్ఎంల మరణంపై తనకు సమాచారం లేదని చెప్పారు. ఇది లావుంటే, హెచ్ఎం దంపతుల మరణంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి విద్యా శాఖ ఒత్తిడి వల్లే వారు కరోనా బారిన పడ్డారని, వీరి మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారని సంఘాల నేతలు ప్రశ్నించారు. దంపతుల మరణాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారంటూ విద్యా శాఖ తీరుపై ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు జి. హృదయ రాజు, కె. వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ. ప్రభుత్వ తీరుని తప్పుట ట్టారు. కాగా, తూర్పుగోదావరిజిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్థంక యూపీ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా వైరస్ సోకింది. ఇటీవల పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఉపాధ్యాయ దంపతుల మరణానికి బాధ్యులెవరు?: ఏపీటీఎఫ్ 

కరోనా ప్రభావం ఉన్నప్పటికీ నాడు- నేడు, జేవీకే తదితర కార్యక్రమాల పేరుతో ఒత్తిడి తేవడం వల్ల ఉపాధ్యాయులు మరణాలకు గురవుతున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయరాజు, కె. వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో గుంటూరు జిల్లా వినుకొండ లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న దంపతులు జి. బ్రాహ్మనందరాజు, జి. దుర్గారాణి గత వారం మరణించారని, వీరునాడు-నేడు, ఎండీఎం తదితర కార్య క్రమాలపై ఒత్తిడి తేవడం వల్లే కరోనా సోకి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులకు సంబంధం లేని పనులు, ఒత్తిడి చేసే పనులు అప్పజెప్పవద్దనని ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తోందన్నారు. మృతి చెందిన ప్రధానోపాధ్యాయుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad