Trending

6/trending/recent

సంపూర్ణ విజ్ఞానం కోసమే 'చదవటం మాకిష్టం'

  • గుంటూరులో కార్యక్రమం ప్రారంభ సభలో విద్యాశాఖ మంత్రి సురేష్

న్యూస్ టోన్, అమరావతి బ్యూరో: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడం, చదువులోని ఆనందాన్ని పరిచయం చేయడానికే 'చదవటం మాకిష్టం' అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పాఠ్యపుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలు చదివితేనే సంపూర్ణ విజ్ఞానం లభిస్తుందన్నారు. గురువారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏర్పాటుచేసిన చదవటం మాకిష్టం (వుయ్ లవ్ రీడింగ్) కార్యక్రమాన్ని హోంమంత్రి మేకతోటి సుచరితతో కలసి సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 'చదవటం మాకిష్టం' లోగో, కరపత్రాలు, గీతాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఏడాది పాటు ఉద్యమంలా తీసుకెళ్తామని సురేష్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లాలో టీచర్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు వీటన్నింటిని అనుసంధానిస్తూ రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ యూనివర్సిటీని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసి టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీగా నామకరణం చేస్తామని తెలిపారు హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చట్టాలు చేసిందన్నారు. వాటిని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్నారు. కాగా, ఇదే వేదికపై రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ విద్యాశాఖ డైరెక్టర్ చిన వీరభద్రుడు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad