Trending

6/trending/recent

గిరిజన విద్యార్థులకు రెండు ప్రత్యేక కేంద్రాలు

  • ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

న్యూస్ టోన్, అమరావతి: గిరిజన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నీట్ ఐఐటీలో శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో రెండు ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పాలకమండలి (బీవోజీ) సమావేశం గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది అనంతరం ఆమె మాట్లాడుతూ..గురుకులాల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలోని పెందుర్తిలో బాలికలకు, మారికవలసలో బాలురకు ప్రత్యేకంగా రెండు నీట్, ఐఐటీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి.. రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఫలితాలు సరిగా రాని 'ఎక్స్టెన్స్ విద్యాసంస్థల'ను సాధారణ విద్యాసంస్థలుగా మార్చేస్తామని చెప్పారు. అవసరమైన చోట సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తామన్నారు. పనులు సకాలంలో చేయని సంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఐటీ వింగ్ ఏర్పాటు చేసి, ఐఐటీ, ఎన్ఐటీలలో నలుగురు కన్సల్టెంట్లను నియమించి ఉన్నత విద్యను అందిస్తామని పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad