Trending

6/trending/recent

పెరిగిన సర్వీసు పాయింట్లు

  • బదిలీల్లో పలువురు ఉపాధ్యాయులకు మినహాయింపు

న్యూస్‌ టోన్-కర్నూలు విద్య: బదిలీల షెడ్యూలులో ప్రభుత్వం మార్పులు చేయడంతో కొందరు ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. షెడ్యూలులో ఇటీవల విద్యాశాఖ చేసిన సవరణలు కొందరికి ప్రయోజనం చేకూర్చింది. ఈనెల 30 నుంచి డిసెంబరు 24వ తేదీ వరకు 25 రోజులపాటు బదిలీలకు వివిధ దశలను నిర్దేశించారు. సవరణ షెడ్యూలు ప్రకారం ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితా ప్రదర్శనకు సంబంధించి సోమవారం నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 

జిల్లావ్యాప్తంగా 11,427 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా అందులో తప్పనిసరిగా బదిలీకి సంబంధించి 2,198 మంది, విన్నపం 4,087 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల విద్యాశాఖ 2020 బదిలీలకు సవరణ షెడ్యూలును విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో స్టేషన్‌ సర్వీసుకు పూర్తి పాయింట్లు (ఎనిమిదేళ్ల నిబంధనల తొలగింపు), గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులకు అయిదేళ్ల స్టేషన్‌ సర్వీసు పూర్తైతేనే కచ్చితంగా బదిలీ వంటి నిబంధనల మార్పుతో జాబితాలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా 2,132 మంది ఉపాధ్యాయులకు తమ సర్వీసుకు అనుగుణంగా పాయింట్లు పెరగనుండగా మిగిలిన 66 మందికి ఎలాంటి పాయింట్లు పెరగటం లేదు. 2015లో జరిగిన బదిలీల్లో భాగంగా నవంబరు 3, 4 తేదీల్లో చేరిన 51 మంది ప్రధానోపాధ్యాయులు తప్పనిసరి బదిలీల నుంచి మినహాయింపు పొందగా మిగిలిన 14 మంది తప్పనిసరి బదిలీలు పొందనున్నారు. ఇప్పటికే సవరించిన జాబితా ప్రకారం జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ప్రత్యేక పాయింట్ల కేటాయింపు

ఉపాధ్యాయుల ప్రతిభ ఆధారంగా పాయింట్లు కేటాయిస్తున్నారు. అంతేకాక భార్యాభర్తలు ఒకే మండలంలో పనిచేసేలా ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నారు. హెచ్‌ఎం, టీచర్లు పనిచేస్తున్నప్పటి నుంచి బదిలీకి అర్హులైన వారి జాబితాను విద్యాధికారులు రూపొందించారు. ప్రత్యేక పాయింట్ల పొందినవారికి ఆశించిన స్థానం పొందే అవకాశం ఉంది. బదిలీలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలో ప్రత్యేక కేటగిరీలను నమోదు చేసుకున్నారు. అందులో ప్రిపరెన్షియల్‌ కేటగిరీలో హెచ్‌ఎంలు నలుగురు, టీచర్లు 262 మంది ఉండగా, స్పౌజ్‌ కేటగిరీలో హెచ్‌ఎంలు 8 మంది, టీచర్లు 715 మంది, స్కూల్‌ పునర్విభజనలో మిగిలినవారు-67 మంది, పెళ్లికాని మహిళా టీచర్లు-76 మంది ప్రత్యేక పాయింట్లు పొందనున్నారు. వీరందరికి పత్రాల పరిశీలన కోసం జేసీ వద్దకు దస్త్రాలు పంపారు. బదిలీకి అర్హులైన టీచర్ల సీనియారిటీ జాబితాను సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో పొందుపరిచాల్సి ఉంది. ఆ తరువాత అభ్యంతరాల కోసం సమయం కేటాయించనున్నారు.

TRANSFER POINTS INCREASED

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad