బదిలీ దరఖాస్తుల వెరిఫికేషన్ కు ఉపాధ్యాయులను ఆఫీస్ కి రప్పించ కూడదు - జేడీ దేవానంద్ రెడ్డి
- ఏ విధమైన హార్డ్ కాపీలు అడగకూడదు
- 75,718 దరఖాస్తుల స్వీకరణ - జేడీ
అమరావతి, న్యూస్ టోన్: ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తు నిన్నటి తో ముగిసింది. 75,718 మంది ఉపాధ్యాయులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నట్లు జే.డీ దేవానంద్ రెడ్డి తెలిపారు. ఇందులో 24,500 మంది తప్పని సరి బదిలీ కావాల్సిన ఉపాద్యాయులు అని తెలిపారు. ఎం.ఈ.ఓ లు డీ.వై.ఈ.ఓ లు ఈ నెల 17,18 తేదీలలో ఈ దరఖాస్తులను వెరిఫై చేయాల్సి ఉంటుంది అని తెలిపారు. ఇలా వెరిఫై చేయడానికి ఉపాధ్యాయులను ఎవరినీ కార్యాలయాలకు రప్పించ కూడదని, అదే విధంగా ఉపాధ్యాయులను ఎవరినీ హార్డ్ కాపీలు అడగ కూడదనీ అధికారులను ఆదేశించారు.
COMMENTS