Trending

6/trending/recent

ఎస్.జీ.టీ లకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేయాల్సిందే

  • కమీషనర్ వారి సమాధానాలకు సమాధానాలు ఇచ్చిన ఫ్యాప్టో
  • బీద వర్గాల పిల్లలపై మాకు ఎనలేని ప్రేమ
  • కమీషనర్ వారి లేఖను అంగీకరించేది లేదు
  • అసంబధ్ధ నిర్ణయాలు సరి చేయాలి

అమరావతి, న్యూస్ టోన్: ఈ నెల 09 వ తేదీన కమీషనర్ వారు ఫ్యాప్టో ప్రశ్నలకు ఘాటుగా బదులు ఇస్తూ లేఖ పంపిన విషయం పాఠకులకు విదితమే. ఈ లేఖ కు సమాధానాలు గా ఫ్యాప్టో కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ కమీషనర్ కు లేఖ రాసింది. లేఖ లోని విషయాలు ఫ్యాప్టో విడుదల చేసింది. చర్చల్లో వచ్చిన విషయాలేవీ అమలుకు నోచుకోవడం లేదని ఫ్యాప్టో ఉద్ఘాటించింది. ప్రతి సందర్భం లో తాము వాడే భాష సరిగానే ఉంటుందని ఫ్యాప్టో తెలిపింది. భాష సరిగా లేదని కమీషనర్ వారు అనడం సరి కాదని తెలిపింది. సిఫార్సు బదిలీలు కేటగిరీ 1,2 పాఠశాలకు చేసి, ఇప్పుడు మిగిలినవి కూడా బ్లాక్ చేయడం సరి కాదని అభిప్రాయ పడింది. బీద వర్గాల పిల్లలపై తమకు ఎనలేని ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయని తెలిపింది. తాము వెబ్ కౌన్సెలింగ్ కు విరుధ్ధం అని తెలిపింది. కనీసం ఎస్.జీ.టీ లకు అయినా మాన్యువల్ కౌన్సెలింగ్ చేయాలని, అది కుదరని పక్షం లో ఇంజనీరింగ్ తరహా లో కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. బదిలీలు, క్రమబద్దీకరణ లో అసంబధ్ధ నిర్ణయాలు సరి చేయాలి అని డిమాండ్ చేసింది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad