Trending

6/trending/recent

పెండింగ్ జీతాలు, పెండింగ్ డిఏ లకు మంత్రి మండలి ఆమోదం

  • మొదటి రెండు డిఏ లు 3.144 గా నిర్ణయం
  • మూడవ డిఏ 5.24 గా నిర్ణయం
  • పెండింగ్ జీతాలు డిసెంబర్‌, జనవరి నెలల్లో చెల్లింపులు

న్యూస్ టోన్, అమరావతి: ఉద్యోగులకు 2019 జులై నుంచి పెండింగులో ఉన్న కరవు భత్యం 5.24శాతం మేర చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగులో ఉన్న మూడు డీఏలలో తొలి రెండు 3.144శాతంగాను, మూడో డీఏ 5.24శాతంగా రాష్ట్ర మంత్రి మండలి శుక్రవారం ఆమోదించింది. మంత్రి మండలి నిర్ణయాలను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరులకు చెప్పారు. తొలి డీఏ అరియర్స్ 30 నెలలవి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. 2018 జులై నుంచి ఇవ్వాల్సిన డీఏ అరియర్స్ భారం రూ.3017 కోట్లుగా పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి జీతాలు, పెన్షన్లతో పాటు నగదు రూపంలో చెల్లిస్తామన్నారు. ఈ డీఏ వల్ల ఏడాదికి ప్రభుత్వంపై భారం రూ.1,206.96 కోట్లు పడుతుందని చెప్పారు.2019 జవనరి నుంచి పెండింగులో ఉన్న డీఏ అమలు వల్ల కూడా ఇదే మొత్తాలు ఖర్చవుతాయని పేర్కొన్నారు. 2019 జులై నుంచి అమలు చేయాల్సిన డీఏ 5.24శాతం చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ అరియర్స్ భారం రూ.5,028.90 కోట్లు పడుతుందన్నారు. మూడో డీఏ వల్ల ఏడాదికి ప్రభుత్వానికి రూ.2,011.56 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. మొత్తం మూడు డీఏల అరియర్స్ భారం రూ.11 వేల కోట్ల పై మాటే అని కన్నబాబు చెప్పారు.

కరోనా కారణంగా ఉద్యోగులకు కోత పెట్టిన వేతనాలను డిసెంబర్‌, జనవరి నెలల్లో చెల్లింపులు చేయనున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు.ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు.కోత విధించిన వేతనాలకు రూ.2,324 కోట్లు, పింఛనుదారులకు రూ.482 కోట్ల చెల్లింపులు చేస్తామన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad