Trending

6/trending/recent

ఉపాధ్యాయుల బదిలీలు - వెబ్ కౌన్సెలింగ్ విధానం అవగాహన UNDERSTAND WEB BASED TRANSFERS

ఉపాధ్యాయ బదిలీలకు పాఠశాల విద్యాశాఖ నిబంధనలను రూపొందిస్తోంది. వాటిని సమీక్షించిన అనంతరం ప్రభుత్వానికి పంపనుంది. గతంలో పెట్టిన పనితీరు ఆధారిత పాయింట్లను తొలగించే అవకాశం ఉంది.

ఉపాధ్యాయులు పనిచేసే పాఠశాల ప్రాంతం, ఉపాధ్యాయుడి సర్వీసు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించేలా కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1.60లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.  

కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు.

 మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఖాళీల ఎంపికకు సమయం ఇస్తారు. ఆన్‌లైన్‌లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు.

మొదట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రింట్ ను MEO గారికి ఇవ్వాలి.

MEO గారు DEO గారికి పంపుతారు.

DEO గారు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లతో అభ్యర్థుల వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతోంది.

ఆప్షన్లు ఇవ్వటానికి ముందు రోజు మీ యొక్క సెల్ ఫోన్ కి పాస్వర్డ్ వస్తుంది.

ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలి.

క్లియర్ ఖాళీలు 500 అనుకోండి.

8 ఇయర్స్ ఖాళీలు 500 అనుకోండి.

బదిలీలు కోసం 4000 మంది దరఖాస్తు చేశారు అనుకోండి.

ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో జిల్లాలో మొత్తం ఖాళీలు 5000గా స్క్రీన్ పై నీకు కనిపిస్తాయి.

ఒకసారి confirm చేసిన తర్వాత మీరు పనిచేస్తున్న పాఠశాల కూడా ఖాళీల జాబితాలోకి వెళ్ళిపోతుంది.

8 & Rationalization ఇయర్స్ కంప్లీటెడ్ టీచర్లు మొత్తం 5000 ఖాళీలు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. లేనిచో ఆప్షన్లు ఇచ్చినట్లు కాదు.

కంపల్సరీ కానివారు ఎన్ని ఆప్షన్లు అయినా  ఇచ్చుకోవచ్చు. చివరి ఆప్షన్ గా తాము ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ ని ఇవ్వాలి.

ఒకసారి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చు.

EDIT ఆప్షన్ లోకి వెళ్లి మీ ఆప్షన్లు క్రమం మార్చుకోవచ్చు.

అయితే ఈ అవకాశం రెండు దఫాలు మాత్రమే ఉంటుంది.

మీ యొక్క ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్ ఆధారంగాను మరియు మీరు ఆప్షన్లు ఇచ్చిన places priority ఆధారంగా మీకు place allotment జరుగుతుంది.

బదిలీ జరిగిన విషయం మీ ఫోన్ కి message రూపంలో వస్తుంది.

మీకు Allotment place చూపించిన తర్వాత మాత్రమే, దాన్ని ఖాళీగా చూపిస్తుంది. ఎటువంటి అపోహలకి తావులేదు.

ప్రతి cycleలో ఏర్పడిన ప్రతి ఖాళీని, 1వ వ్యక్తి నుండి వరుసగా ఎవరు కోరిఉన్నారా...? అని చెక్ చేస్తుంది.

ఎప్పుడైనా ఒక ఖాళీ ఏర్పడితే ఆ cycle లో ముందుగా ఏ సీనియర్  కోరి ఉంటారో...? వారికే కేటాయిస్తుంది.

మీరు ఇచ్చిన ఆప్షన్లు లో మీకు ఏది రాకపోయినా, చివరి ఆప్షన్(Presnt school)కేటాయించబడుతుంది.

బదిలీ ఆర్డర్ కూడా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad