తెలుగు రాష్ట్రాలకు మరో వాన గండం పొంచి ఉంది CYCLONE ALERT TO TELUGU STATES
తెలుగు రాష్ట్రాలకు మరో వాన గండం పొంచి ఉంది. బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది
దీని ప్రభావంతో రాగల రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిసా తీరం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
COMMENTS