Trending

6/trending/recent

ఏపీ స్కూల్ రెగ్యులేటరీ మిషన్ తనిఖీలు APSERMS VISITS TO SCHOOLS TO VERIFY UDISE DATA

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ & మానిటరింగ్ కమిషన్ APSERMC  ఛైర్ పర్సన్ జస్టిస్ శ్రీ ఆర్. కాంతారావు గారి ఉత్తర్వుల సారాంశం

[post_ads]

👉 రాష్ట్రంలో మొత్తం 62413 పాఠశాలలుండగా , అందులో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య  44778 , ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 15044 , ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య  2591.

👉 UDISE డేటా మూల్యాంకనం చేయుటకు రాష్ట్రంలో  పాఠశాల విద్యా శాఖ తరపున 4 గురు RJD SE లు  , 13 మంది DEO లు , 66 మంది DyEO లు , 666 మంది MEO లు కలరు. పై గణాంకాల ప్రకారం ప్రతి అధికారి సాలీనా/సగటున 83 పాఠశాలలు సందర్శన/తనిఖీ చేయవలసి ఉంటుంది.

👉 APSERMC కి సంక్రమించిన అధికారాల మేరకు  మరియు DSE AP వారితో చర్చల అనంతరం, UDISE లో పొందుపరచబడిన ఉపాధ్యాయ సిబ్బంది యొక్క లభ్యత , మౌలిక సదుపాయాలు , ఇతర వివరాల నమోదును సరిచూడాలని/తనిఖీ చేయాలని  నిర్ణయించబడినది.

👉 ది.05.10.2020 నుండి ది.17.10.2020 వరకు రెండు దశలలో 2591 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలను, 15044 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలను  తనిఖీ చేయాలి  మరియు ది.17.10.2020 నుండి ది.31.10.2020 వరకు మూడవ దశలో భాగంగా 44778 ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ చేయవలసి ఉన్నది.

👉 తనిఖీ  చేయు బృందాలు

హైస్కూల్ : గ్రేడ్ 2 HM (1), SGT(1) , గ్రామ/వార్డ్ సంక్షేమ సహాయకులు(1) , గ్రామ/వార్డ్ ఇంజనీరింగ్ సహాయకులు(1)

ప్రైమరీ స్కూల్ : గ్రేడ్ 2 HM లేదా SA (1) , గ్రామ/వార్డ్ సంక్షేమ సహాయకులు(1) , గ్రామ/వార్డ్ ఇంజనీరింగ్ సహాయకులు(1)

👉 ఈ బృందాలకు తాము పనిచేయు మండలాలలో తనిఖీ  బాధ్యతలు కేటాయించరాదు.

👉 డా శ్రీమతి ఏ. విజయ శారదా రెడ్డి , వైస్ ఛైర్ పర్సన్ , APSERMC మరియు ఇతర APSERMC సభ్యులు సదరు తనిఖీని పర్యవేక్షణ చేస్తారు.

👉 కావున తనిఖీ చేయు క్షేత్రస్థాయి అధికారులకు/సిబ్బందికి  పై సూచనలు పాటించేలా తగు మార్గదర్శనం చేయవలసిందిగా అందరు RJD SE లను , DEO లను , APC SS లను కోరుతూ APSERMC ఛైర్ పర్సన్ జస్టిస్ శ్రీ ఆర్. కాంతారావు  ఉత్తర్వులు జారీచేశారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad