Trending

6/trending/recent

బదిలీల సమాచారం TRANSFERS NEWS 19.09.2020

35వేల మంది గురువులకు బదిలీలు

విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా చేసిన హేతుబద్ధీకరణలో సుమారు 15వేల మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. వీరు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ వివరాలను జిల్లా విద్యాధికారుల వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు. వీరు కాకుండా 8ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు మరో 20 వేల వరకు ఉన్నారు. అంటే ఈసారి మొత్తంగా 35 వేల మంది తప్పనిసరిగా బదిలీ కానున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాఠశాలల కేటగిరీలు, ఖాళీలు, ప్రాధాన్య కోటా వినియోగం వివరాలను నమోదు చేయాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. హెచ్‌ఆర్‌ఏ 20 శాతం, 14.5 శాతం, 12 శాతం ఉన్నవి, బడుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.   ఐచ్ఛికం ఇవ్వగానే ఆ పాఠశాల ఏ కేటగిరీ కిందకు వస్తుందో తెలుస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. వీటిని జిల్లా విద్యాధికారికార్యాలయం నమోదు చేయనుంది.

8ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు గతంలో ప్రాధాన్య కేటగిరీని వినియోగించుకున్నారా లేదా అన్నది నమోదు చేయనున్నారు. ఈ సదుపాయాన్ని 8ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఉపాధ్యాయ ఖాళీలన్నీ అప్లోడ్ చేయాలి

డిఇఒలకు విద్యాశాఖ ఆదేశాలు

రేషనలైజేషన్ పై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. డిఇఒ కార్యాలయం అన్ని రకాల ఉపాధ్యాయ ఖాళీలను అప్లోడ్ చేయాలని జిల్లాల నుంచి వచ్చిన అధికారులకు విద్యాశాఖ ఆదేశించింది. కమిషనరు కార్యాలయంలో మూడు రోజులపాటు నిర్వహించిన సమావేశం శుక్రవారంతో ముగిసింది. 16న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, 7న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, 18న చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన అధికారులతో పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టరు దేవానందరెడ్డి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, రేషనలైజేషన్ ద్వారా ఎన్ని ఖాళీ అవుతాయి, బదిలీల వల్ల ఏర్పడే ఖాళీల వివరాలను రూపొందించాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థులు 60 వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు ఇద్దరు టీచర్లను, విద్యార్థుల సంఖ్య 90 వరకు ఉంటే ముగ్గురిని, ఆ తర్వాత ప్రతి 30 మందికి ఒక టీచర్ చొప్పున కేటాయింపు ఉంటుంది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే అక్కడ పోస్టులను తీయొద్దని అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఉన్నత పాఠశాలల్లో 200 మంది విద్యార్థులు ఉంటే 9 మంది ఉపాధ్యాయులు, ఆపైన ప్రతి 40 మంది విద్యార్థులకు 2-3 చొప్పున ఉపాధ్యాయుల సంఖ్య కేటాయించనున్నట్లు సమాచారం

Tags

Post a Comment

1 Comments
  1. బ ది లీల త ర్వాతె rationalisation చే యాలి
    అప్పుడే senior teachers కి మంచి జరుగుతుంది

    ReplyDelete

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad